కోవిద్ 19 : వణికిపోతున్న అమెరికా.. ఒక్కరోజులో 3వేలకు పైగా మృతి..

By AN TeluguFirst Published Dec 4, 2020, 12:32 PM IST
Highlights

అగ్రరాజ్యం అమెరికా కరోనా మరణాల్లోనూ అగ్రస్థాయిలోనే ఉంది. రోజు రోజుకు తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టుకుంటోంది. గురువారం ఒక్కరోజే 3, 157 కరోనా మరణాలతో అమెరికా వణికిపోతోంది. ఒక్కరోజులో ఎప్పుడూ లేనంతగా అమెరికాలో కరోనా కేసులు పెరిగాయి.  

అగ్రరాజ్యం అమెరికా కరోనా మరణాల్లోనూ అగ్రస్థాయిలోనే ఉంది. రోజు రోజుకు తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టుకుంటోంది. గురువారం ఒక్కరోజే 3, 157 కరోనా మరణాలతో అమెరికా వణికిపోతోంది. ఒక్కరోజులో ఎప్పుడూ లేనంతగా అమెరికాలో కరోనా కేసులు పెరిగాయి.  

గురువారం రాత్రి 8 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం అమెరికాలో 2,10,000 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.  అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,24,678కి చేరింది.  

కరోనా కేసులతో పాటుగా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి.  ఏప్రిల్ నెలలో అత్యధికంగా 2603 కరోనా మరణాలు సంభవించాయి.  ఇప్పటి వరకు అదే అత్యధికం. కానీ, నిన్న ఒక్కరోజే 3,157 మంది కరోనాతో మృతి చెందటంతో అధికారులు అధికారులు ఆందోళన చెందుతున్నారు.  రాబోయే రోజుల్లో కేసులు మరణాల సంఖ్య మరింత ఎక్కువుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

డిసెంబర్ నెల ప్రారంభం నుంచి మరణాల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఒకటో తేదీన 2500 మంది మృత్యువాత పడ్డారు. ఆ తరువాత గురువారం 3,157 మంది చనిపోయారు. దీంతో అగ్రరాజ్యం అతలాకుతలం అవుతోంది. 

అగ్రరాజ్యంలో కరోనా అదుపులోకి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అమెరికాలో కరోనా పీక్ లో ఉన్నది.  ఆ సమయంలోనే 70 వేల వరకు కేసులు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు అంతకంటే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

కరోనా పీక్ దశలో ఉన్న సమయంలో అమెరికాలో ఒక్కరోజులో 2562 కేసులు నమోదయ్యాయి.  ఆ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించలేదు.  ఇప్పుడు మళ్లీ 2500 మరణాలు నమోదయ్యాయి.  

ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అమెరికన్లు బంధువుల ఇళ్లకు వెడుతున్నారు. కరోనా నిబంధనలు అమలు కావడం లేదు.  నిబంధనలను ఇలానే గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ఈ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

click me!