కోవిద్ 19 : అమెరికాలో ఒక్కరోజులో 2500 మంది మృతి

By AN TeluguFirst Published Dec 2, 2020, 1:38 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం తగ్గడం లేదు. అదుపులోకి వచ్చినట్టే వస్తూ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో విలవిలలాడుతోంది. తాజాగా ఒక్కరోజే 2500 మంది మృత్యువాత పడడంతో బెంబేలెత్తి పోతోంది. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం తగ్గడం లేదు. అదుపులోకి వచ్చినట్టే వస్తూ విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా కరోనాతో విలవిలలాడుతోంది. తాజాగా ఒక్కరోజే 2500 మంది మృత్యువాత పడడంతో బెంబేలెత్తి పోతోంది. 

అగ్రరాజ్యంలో కరోనా అదుపులోకి వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అమెరికాలో కరోనా పీక్ లో ఉన్నది.  ఆ సమయంలోనే 70 వేల వరకు కేసులు నమోదయ్యాయి.  

కానీ, ఇప్పుడు అంతకంటే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజు అమెరికాలో 1,80,000 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులతో పాటు మరణాల సంఖ్యా అధికంగానే ఉంటోంది. నిన్న ఒక్కరోజే కరోనాతో 2500 మంది మృతి చెందారు. 

కరోనా పీక్ దశలో ఉన్న సమయంలో అమెరికాలో ఒక్కరోజులో 2562 కేసులు నమోదయ్యాయి.  ఆ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించలేదు.  ఇప్పుడు మళ్లీ 2500 మరణాలు నమోదయ్యాయి.  

ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అమెరికన్లు బంధువుల ఇళ్లకు వెడుతున్నారు. కరోనా నిబంధనలు అమలు కావడం లేదు.  నిబంధనలను ఇలానే గాలికి వదిలేస్తే రాబోయే రోజుల్లో ఈ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

click me!