ఫ్రాన్స్‌లో మోడీ-ట్రంప్ భేటీ: కాశ్మీర్‌పై మళ్లీ మాట మార్చిన అగ్రరాజ్యాధినేత

By Siva KodatiFirst Published Aug 26, 2019, 4:31 PM IST
Highlights

మోడీతో కాశ్మీర్ అంశంపై చర్చించినట్లు అగ్రరాజ్యాధినేత ట్రంప్ వెల్లడించారు. పాక్, భారత్ కలిసి సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నానట్లు ఆయన తెలిపారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా భారత్-పాక్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. 

ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ... సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి నేతల మధ్య రక్షణ, వాణిజ్య అంశాలపై కీలక చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

అమెరికా-భారత్ మధ్య సత్సంబంధాలున్నాయిని మోడీ వ్యాఖ్యానించారు. ట్రంప్ తనకు మంచి మిత్రుడని.. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించామని మోడీ తెలిపారు.

ట్రంప్‌తో భేటీ కావడం గర్వంగా భావిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో పరిస్ధితులు అదుపులోనే ఉన్నాయని.. మిగతా దేశాలు కాశ్మీర్ వ్యవహారంలో ఆందోళన చెందవద్దని మోడీ తెలిపారు.

మోడీతో కాశ్మీర్ అంశంపై చర్చించినట్లు అగ్రరాజ్యాధినేత ట్రంప్ వెల్లడించారు. పాక్, భారత్ కలిసి సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నానట్లు ఆయన తెలిపారు.

కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని.. చర్చల ద్వారా భారత్-పాక్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ సూచించారు. ఎన్నికల తర్వాత ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడానని, ఇరు దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికా అధినేత అభిప్రాయపడ్డారు. 
 

click me!