చంపి.. గుండెను కూర వండేసి.. అతిథులకు వడ్డించి..

Published : Feb 25, 2021, 09:24 AM IST
చంపి.. గుండెను కూర వండేసి.. అతిథులకు వడ్డించి..

సారాంశం

ఓక్లాహామా ప్రాంతానికి చెందిన లారెన్స్ పాల్ అండెర్సన్ అనే వ్యక్తి అతి దారుణంగా మూడు హత్యలు చేశాడు. ముందుగా తన ఇంటి పక్కన ఉండే మహిళను చంపేశాడు. 


ఓ వ్యక్తి కిరాతకంగా మూడు హత్యలు చేశాడు. తొలుత ఓ మహిళను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె గుండెను బయటకు తీసి.. దానితో ఆలుగడ్డలు కలిపి కూర వండేశాడు. ఆ తర్వాత దానిని మరో ఇద్దరిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం లో పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరిని కూడా అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓక్లాహామా ప్రాంతానికి చెందిన లారెన్స్ పాల్ అండెర్సన్ అనే వ్యక్తి అతి దారుణంగా మూడు హత్యలు చేశాడు. ముందుగా తన ఇంటి పక్కన ఉండే మహిళను చంపేశాడు. అనంతరం ఆమె శరీరంలోని గుండెను బయటకు తీశాడు. ఆ గుండెను తీసుకొని తన అంకుల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ వాళ్లకు ఆలుగడ్డలతో ఈ గుండెను కలిపి వంట చేశాడు.

ఆ కూరను తన అంకుల్, ఆంటీకి వడ్డించాడు. ఆ తర్వాత అంకుల్, ఆంటీ వాళ్ల నాలుగేళ్ల మనవరాలిపై దాడి చేశాడు. అంకుల్, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. లారెన్స్ ఆంటీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నిందితుడికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 2017లో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడని.. 20ఏళ్ల జైలు శిక్ష కూడా విధించారని తెలుస్తోంది. బెయిల్ పై బయటకు వచ్చి.. ఈ కిరాతకానికి పాల్పడటం గమనార్హం. కాగా.. ఈ హత్యలన్నీ తానే చేసినట్లు అతను అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే