
Russai Ukraine War : ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొసాగుతునే ఉంది. ఉక్రెయిన్ నగరాలపై గత 25 రోజులుగా విధ్వంసం సృష్టిస్తునే ఉంది. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షదాలి మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. బతుకు జీవుడా అనుకుంటూ.. ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. తమ పిల్లలతో సరిహద్దు దేశాల్లో తలదాచుకుంటున్నారు.
యుద్దం నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి చెబుతున్నా.. అమెరికాతో పాటు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. రష్యాను చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం ఎవ్వరి మాట వినని సీతయ్యలా ఉన్నాడు. మరోవైపు శాంతి చర్చలకు ఆహ్వానం పలుకుతూనే.. బాంబుల దాడులకు తీవ్రం చేస్తుంది.
ఈ క్రమంలో యుద్ధాన్ని ముగించడానికి పుతిన్‌తో నేరుగా చర్చలు నిర్వహించాలని, చర్చలతోనే యుద్దాన్ని ఆపగలమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నొక్కి చెప్పాడు. చర్చలు లేకుండా యుద్ధాన్ని ఆపడానికి.. రష్యా సిద్ధంగా ఉందో తెలుసుకోవడం అసాధ్యం అని తాను నమ్ముతున్నానని జెలెన్స్కీ చెప్పారు. రష్యాతో ఎలాంటి రాజీకైనా సిద్దమే.. కానీ, ఉక్రెయిన్ లో ప్రజాభిప్రాయ సేకరణ అవసరమని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఏ విధంగా నైనా.. చర్చించడానికి సిద్దమేనని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం అన్నారు.
యుద్ధాన్ని ఆపడానికి తాను రష్యాతో చర్చలను సిద్దంగా ఉన్ననని, ఏలాంటి సమావేశానికైనా సిద్దంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నరు. అయితే.. యుద్ద విరమించడానికి రష్యా సిద్ధంగా ఉందో ? లేదో తెలియడం లేదని జెలెన్స్కీ అన్నారు. Zelensky గతంలో "చర్చలు లేకుండా మేము యుద్ధాన్ని ముగించలేము" అని చెప్పాడు. పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చాడు, అయితే సోమవారం నాడు అతని వ్యాఖ్యలు ముఖ్యంగా పట్టుదలతో ఉన్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్-రష్యా చర్చల అనేక సెషన్‌లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగాయి.
గత 26 రోజులుగా రష్యా, ఉక్రెయిన్‌లపై మధ్య యుద్ధం సాగుతోంది. రోజురోజుకు ఇరు దేశాల మధ్య వైరం తీవ్రం అవుతుంది. నగరాలపై పట్టు సాధించేందుకు రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా సైనికులు హైపర్ సోనిక్ మిస్సైల్స్‌ను ప్రయోగిస్తున్నారు. తొలుత సైనిక స్థావరాలపై దాడి చేసిన రష్యన్ సేనలు.. సాధారణ పౌరులను కూడా టార్గెట్ చేస్తూ దాడులను ముమ్మరం చేసింది. మారియుపోల్‌లో దాదాపు 400 మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఆర్ట్ స్కూల్‌పై రష్యా సైన్యం బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు.