Russia Ukraine Crisis: ర‌ష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్‌.. !

Published : Mar 20, 2022, 11:40 AM IST
Russia Ukraine Crisis: ర‌ష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్‌.. !

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. వార్ నేప‌థ్యంలో ఇరువైపుల‌పెద్ద ఎత్తున్న న‌ష్టం జ‌రుగుతోంది. ఉక్రెయిన్ త‌న‌పై కొన‌సాగుతున్న దాడిని ఎదుర్కొంటూ.. ర‌ష్యాకు ధీటుగా స‌మాధాన‌మిస్తోంది. ఈ క్ర‌మంలోనే ర‌ష్యాకు చెందిన మూడు విమానాల‌ను కూల్చివేసిన‌ట్టు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.   

Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకోవడంతో ఇరువైపులా భారీ ప్రాణనష్టం కొనసాగుతోంది. రష్యాకు చెందిన మూడు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాల్గవ వారంలోకి ప్రవేశించిన క్ర‌మంలో వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాకు భయంకరమైన హెచ్చరికను జారీ చేశారు. రాబోయే తరాలకు యుద్ధ పరిణామాలను దేశం చవిచూస్తుందని చెప్పారు. అర్థవంతమైన ద్వైపాక్షిక చర్చలకు కట్టుబడి ఉక్రెయిన్‌పై దాడిని ఆపాలని ర‌ష్యాకు Zelenskyy పిలుపునిచ్చారు. అయితే రష్యా తన హైపర్‌సోనిక్ క్షిపణులు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో  క్షిపణులు, బాంబుల‌తో విరుచుకుప‌డింది. అక్క‌డి బంక‌ర్ల‌ను నాశ‌నం చేసింది. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం 20 రోజులు దాటింది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ర‌ష్యా సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూ... త‌న‌పై ఆంక్ష‌లు విధించిన దేశాల‌పై  ర‌ష్యాలో కార్య‌కలాపాలు నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు విధిస్తోంది.

ర‌ష్యా మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతుండ‌టంతో వైమానిక దాడులు జ‌రిగే ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉక్రెయిన్ లోని చాలా న‌గ‌రాల్లో యుద్ధ సైర‌న్లు మోగాయి. సుమీ, మైకోలైవ్, టెర్నోపిల్, పోల్టావా, కిరోవోహ్రాద్, ఖార్కివ్, జపోరిజ్జియా, కైవ్, ల్వివ్, ఇవానో-ఫ్రాంకివ్స్క్, డ్నిప్రోపెట్రోవ్స్క్, రివ్నే, వోలిన్, చెర్కాసీ, ఝైటోమైర్, విన్నిట్సియా, ఒడేసా ఓబ్లాస్ట్స్లో  న‌గ‌రాల్లో యుద్ధ సైన‌ర్లు మోగాయి. ర‌ష్యా సేన‌లు మొద‌టి నుంచీ ఈ కైవ్ ను స్వాధీనం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే దీనిని ర‌ష్యా వశం కానివ్వ‌కుండా ఉక్రెయిన్ బ‌ల‌గాలు అడ్డుకుంటున్నాయి. యుద్దం మొద‌లైన మొద‌టి రోజుల్లోనే ర‌ష్యా కైవ్ పై దాడి చేయ‌డం ప్రారంభించింది. దీంతో ఆ న‌గ‌రంలో తీవ్రంగా ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. సైనికుల‌తో పాటు సాధార‌ణ పౌరులు కూడా మృతి చెందుతున్నారు. అయితే యుద్ధం ప్రారంభ‌మైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ ముఖ్య‌న‌గ‌రం కైవ్ లో దాదాపు 228 మంది మరణించారు. ఈ విష‌యాన్ని ఆ దేశం అధికారికంగా ప్ర‌క‌టించింది. ‘‘ ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి రాజధానిలో నలుగురు పిల్లలతో పాటు మొత్తంగా 228 మంది సాధారణ పౌరులు మరణించారు. మరో 912 మంది గాయపడ్డారు ’’ అని కైవ్ నగర అధికారులు పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే