Russia Ukraine Crisis: మ‌రోమారు చ‌ర్చ‌ల‌కు సిద్దం: ఉక్రెయిన్

Published : Mar 05, 2022, 06:17 AM IST
Russia Ukraine Crisis:  మ‌రోమారు చ‌ర్చ‌ల‌కు సిద్దం: ఉక్రెయిన్

సారాంశం

Russia Ukraine Crisis:  ​ర‌ష్యాతో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ భావిస్తుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పోడోల్యాక్ చెప్పారు.   

Russia Ukraine Crisis:  ఉక్రెయిన్‌పై రష్యా అధినేత పుతిన్  చేస్తున్న విధ్వంసాన్ని ఇప్పట్లో ఆపేలా లేడు. యుద్దం ముగించే సూచనలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. పైగా..రోజురోజుకు ఉక్రెయిన్ పై రష్యా బ‌లాగాలు బీకర పోరు కొనసాగున్నాయి. తొమ్మిది రోజులుగా బాంబులు, కాల్పులతో ఉక్రెయిన్   దద్దరిల్లుతోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్లోని ప‌లు న‌గ‌రాలను ర‌ష్యా బ‌ల‌గాలు ఆక్ర‌మించాయి. ర‌ష్యా చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డాని ఉక్రెయిన్ అనేక విధాలు ప్ర‌య‌త్నిస్తుంది. అయినా.. ఫ‌లితం లేకుండా పోతుంది.  పుతిన్ వైఖరిపై విదేశాలతో పాటు స్వదేశంలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ త‌రుణంలో రష్యా​తో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ భావిస్తుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఈ చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పోడోల్యాక్ చెప్పారు. యుద్ధాన్ని ఆపడానికి రష్యాతో చర్చలు జరప‌డానికి ఉక్రెయిన్​ సిద్దంగా ఉండ‌నీ, ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపినా.. ఎలాంటి పురోగతి కనిపించలేదనీ.. అయినా.. ఈ విధ్వంసానికి ముగింపు ప‌ల‌క‌లంటే..
మరో రెండురోజుల్లో మూడోసారి రష్యాతో చర్చలు జరిపాలని ఉక్రెయిన్​ భావిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్​ అధ్యక్షుడి సలహాదారు మైఖైలో పోడోల్యాక్  తెలిపారు. గురువారం బెలారస్‌లో జరిగిన రెండో విడత చర్చల్లో ప్ర‌ధానంగా సాధార‌ణ పౌరుల‌ను ర‌క్షించ‌డానికి.. ప్ర‌త్యేక కారిడార్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి ఇరుదేశాలు  అంగీకరించాయి. ఇందులో భాగంగానే ఇరుపక్షాలు సైనిక సమస్యలు, మానవతా సమస్యలు, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారంపై చర్చించాయి.

 రెండు సార్లు చ‌ర్య‌లు జ‌రిగినా.. పుతిన్​( ర‌ష్యా) దూకుడు మాత్రం ఆగ‌డం లేదు. రోజుకో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ.. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చొరబడుతున్నాయి. తాజాగా రష్యా చేసిన ఓ దాడి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ఏకంగా ఉక్రెయిన్‌లోని న్యూక్లియర్‌ ప్లాంట్‌పైనే క్షిపణి దాడి చేసింది ర‌ష్యా. ఉక్రెయిన్‌లో అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జప్రోజియాపై పలుమార్లు దాడులు జరిగినట్టు సమాచారం. అణు విద్యుత్‌ కేంద్రంపై జరిగిన దాడిని ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కూడా విడుదల చేసింది. 

ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్యను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇదివరకే వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌ను లొంగదీసుకునే క్రమంలో రష్యా అణు పదార్థాలతో చెలగాటం ఆడటాన్ని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రాణ నష్టంతో పాటు.. న్యూక్లియర్‌ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. దీంతో అక్కడ భారీ ఎత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే