Russia Ukraine Crisis: అణుబాంబు తయారుచేస్తున్న ఉక్రెయిన్: రష్యా

Published : Mar 06, 2022, 02:22 PM IST
Russia Ukraine Crisis: అణుబాంబు తయారుచేస్తున్న ఉక్రెయిన్: రష్యా

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై దాడిని కొన‌సాగిస్తున్న ర‌ష్యా పై క‌ఠిన ఆంక్షలు విధించాల‌ని భార‌త్ స‌హా ప‌లు దేశాల‌కు ఉక్రెయిన్ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అయితే, ఉక్రెయిన్‌  చెర్నోబిల్ లో అణుబాంబును తయారు చేస్తోందంటూ రష్యా ఆరోపించింది. తన సొంత అణ్వాయుధాలను సృష్టించడానికి సోవియట్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని పుతిన్ పేర్కొన్న‌ట్టు ర‌ష్యాన్ మీడియా పేర్కొంది.   

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాల‌ను, కీల‌క ప్రాంతాల‌ను త‌న అధీనంలోకి తీసుకుని ర‌ష్యన్ బ‌ల‌గాలు ఉక్రెయిన్ పై విరుచుకుప‌డుతున్నాయి. ఉక్రెయిన్ సైతం ర‌ష్య‌న్ బ‌ల‌గాల‌కు ధీటుగా స‌మాధాన‌మిస్తోంది. ఈ క్ర‌మంలోనే ర‌ష్యా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఉక్రెయిన్ అనుబాంబుల‌ను త‌యారు చేస్తోంద‌నీ, దీని కోసం సోవియ‌ట్ యూనియ‌న్ టెక్నాల‌జీని వాడుతున్న‌ద‌ని ఆరోపించింది. 

ఉక్రెయిన్ పై మొద‌ట‌గా దాడిని ప్రారంభించిన ర‌ష్యా.. ఇత‌ర దేశాల హెచ్చ‌రిక‌ల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ.. దాడుల తీవ్ర‌త‌ను పెంచి.. వేల మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, యుద్దం ఆపాల‌ని ప్ర‌పంచ దేశాలు రష్యాను కోరుతున్నా.. వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ప్ర‌పంచ అగ్ర దేశాల‌కు స‌వాలు విసురుతున్నారు అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ఉక్రెయిన్ పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో రెచ్చిపోయారు. చెర్నోబిల్ కేంద్రంగా ఉక్రెయిన్ అణుబాంబు త‌యారు చేస్తోందంటూ ఆరోపించారు. అంతే కాకుండా త‌న స్వంత అణ్వాయుధాల‌ను సృష్టించేందుకు త‌మ దేశానికి చెందిన ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. దీనికి డర్టీ బాంబు పేరు పెట్టారని అన్నారు.  

అయితే, అణుబాంబును త‌యారు చేయ‌డానికి సంబంధించిన ఆరోప‌ణ‌లకు ఎలాంటి ఆధారాలు తమ వ‌ద్ద లేవ‌ని పేర్కొన్న‌ట్టు ర‌ష్య‌న్ మీడియా పేర్కొంది. అయితే,  ప‌క్కాగా చెర్నోబిల్ లో అణుబాంబు త‌యారు చేస్తుంద‌న్న స‌మాచారం త‌మ వ‌ద్ద ఉంద‌న్నాడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉక్రెయిన్ ప్లూటోనియం ఆధారిత అణ్వాయుధ నిర్మాణానికి ద‌గ్గ‌రగా ఉంద‌ని ఆరోపించాడు. ఆ అణుబాంబుకు డ‌ర్టీ బాంబ్ అని పేరు కూడా పెట్టార‌ని ఆరోపించాడు. అయితే పాశ్యాత్య దేశాలు ర‌ష్యా ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించాయి. రష్యా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని  ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే రష్యా దాడులను  ఆపాలని హెచ్చరించాయి. 

2000లో మూసివేయబడిన చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని రష్యాలోని సమర్థవంతమైన సంస్థ ప్రతినిధి  వ్యాఖ్య‌ల‌ను TASS, RIA మరియు ఇంటర్‌ఫాక్స్ వార్తా సంస్థలు ఆదివారం ఉటంకించాయి. కాగా, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1994లో అణ్వాయుధాలను వదులుకున్న ఉక్రెయిన్ ప్రభుత్వం అణు క్లబ్‌లో తిరిగి చేరే ఆలోచన లేదని పేర్కొంది. అణుబాంబు త‌యారు చేయ‌డం అంటే ఉక్రెయిన్ ర‌ష్యాపై యుద్దం ప్ర‌క‌టించ‌డ‌మేనంటూ పుతిన్ ఆరోపించాడు. అణుబాంబుల వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

ఇదిలావుండగా, ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. వేలాది మంది ప్రాణాలు పోవ‌డానికి.. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులు కావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్న ర‌ష్యాపై మ‌రిన్ని క‌ఠిన‌ ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా.. ప్ర‌పంచ దేశాలను కోరారు. భారత్‌తో సహా ప్ర‌పంచ దేశాల ప్రభుత్వాలు  ప్ర‌స్తుతం కొనసాగుతున్న ఈ సంఘర్షణను ఆపేందుకు రష్యాకు విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడిన కులేబా.. రష్యా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. విదేశీ విద్యార్థులతో సహా పౌరులను ఖాళీ చేయడానికి కాల్పులు నిలిపివేయాలని కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి