ట్రంప్ కి ట్విట్టర్ షాక్..ఆయన ఖాతాపై పూర్తి నిషేధం..!

By telugu news teamFirst Published Jan 9, 2021, 8:01 AM IST
Highlights

వాషింగ్టన్‌ నేషనల్‌ మాల్‌ ముందు ప్రదర్శనలో ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఓ వైపు క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంలో బైడెన్ ఎన్నిక గురించి స‌మావేశం జ‌రుగుతుండ‌గా..  మరో వైపు ట్రంప్ తన మద్దతుదారుల్ని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ తగిలింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.  ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్స్ ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ట్రంప్.. తన ట్విట్టర్ ద్వారా ‘హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేశాం’ అని ట్విట్టర్‌ తన నిర్ణయాన్ని బ్లాగ్‌ పోస్ట్‌లో వివరించింది. 

గత నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జోబైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించేందుకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ ఇటీవల సమావేశమైంది. దీన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకురావడంతో ఘర్షణ చెలరేగింది. నలుగురు పౌరులతో పాటు గాయపడ్డ ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. వాషింగ్టన్‌ నేషనల్‌ మాల్‌ ముందు ప్రదర్శనలో ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఓ వైపు క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంలో బైడెన్ ఎన్నిక గురించి స‌మావేశం జ‌రుగుతుండ‌గా..  మరో వైపు ట్రంప్ తన మద్దతుదారుల్ని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు.

ఇంటికి వెళ్లాలంటూ అభిమానుల్ని వేడుకుంటూనే.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో మోసం జరిగిందని ఆరోపించారు. నేష‌న‌ల్ మాల్‌లో మాట్లాడిన త‌ర్వాత‌.. క్యాపిట‌ల్ హిల్ భ‌వ‌నంలోనూ జ‌రిగిన దాడికి సంబంధించిన వీడియోను ఒక‌టి ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు.  ‘ఐ ల‌వ్ యూ’ అంటూ త‌న అభిమానుల్ని మ‌రింత రెచ్చగొట్టారు. దీంతో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకు వెళ్లి హంగామా సృష్టించారు. అయితే, సోష‌ల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేసిన వీడియోను.. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌తో సహా ట్విట్టర్‌ సంస్థలు తొలగించాయి. ట్విట్టర్‌ 12 గంటల పాటు ట్రంప్‌ అకౌంట్‌ను లాక్‌ చేసింది. పోస్టులను తొలగించకుంటే ఖాతాపై శాశ్వత నిషేధం విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ క్రమంలో ట్విట్టర్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ మద్దతుదారులు జరిపిన ‘తిరుగుబాటు’తో తాము బాధపడుతున్నామని ట్విట్టర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్‌ డోర్సేకు అనేక మందల మంది ఉద్యోగులు లేఖలు రాశారని కంపెనీ తెలిపింది.


 

click me!