ఆస్పత్రి నుండి బైటికొచ్చిన ట్రంప్.. కారులో చక్కర్లు కొట్టి అభివాదం..

By AN TeluguFirst Published Oct 5, 2020, 10:49 AM IST
Highlights

కోవిద్ పాజిటివ్ తో  వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారుల కోసం కాసేపు బైటికి వచ్చి కనిపించాడు. హాస్పటల్ లోపల కాసేపు కారులో చక్కర్లు కొట్టాడు. తాను బాగానే ఉన్నానని చేతితో సైగలు చేస్తూ చెప్పుకొచ్చాడు. 

అమెరికా జాతీయ జెండా పట్టుకుని వచ్చిన మద్దతు దారులకు అభివాదం చేశారు. త్వరలోనే తన అభిమానులను ఆశ్చర్యంలో ముంచబోతున్నానని.. ఈ పర్యటన సంబంధించి ముందుగానే ట్విట్టర్ లో సంకేతం ఇచ్చారు. ట్వీట్ చేసిన కాసేపటికే బైటికి వచ్చి సర్ ఫ్రైజ్ చేశాడు. 

అయితే ఇలా బైటికి రావడం కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాను కరోనా గురించి చాలా తెలుసుకున్నానని అంతకుముందు విడుదల చేసిన వీడియోలో ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనికోసం స్కూల్ కు వెళ్లి మరీ నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. 

వాల్టర్ రీడ్ ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకోసం ఎదురుచూస్తున్న అభిమానులు గొప్ప దేశభక్తులుగా అభివర్ణించారు. ట్రంప్ కు ఆక్సీజన్ లెవల్స్ పడిపోవడం వల్లే ఆస్పత్తిలో చేర్చాల్చి వచ్చిందని ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న డాక్టర్ సియాన్ కాన్లే ఆదివారం తెలిపారు. దీంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్ హౌజ్ నిజాల్ని దాచిపెడుతోందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాన్లే ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 
 
click me!