Train accident: ఘోర రైలు ప్రమాదం.. 15మంది మృతి

By telugu teamFirst Published Nov 12, 2019, 10:51 AM IST
Highlights

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో రైలు ఇంజిన్లు సహా ముందు బోగీలు చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 
 

బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15మంది మృతి చెందారు. కాగా.. 40మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ సంఘటన కస్బా ప్రాంతంలోని మండోల్ బాగ స్టేషన్ వద్ద  ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఢాకా వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఎదురుగా చిట్టగాంగ్ వైపు వస్తున్న మరో రైలను వేగంగా ఢీకొట్టింది. దీంతో చిట్టగాంగ్ వెళ్తున్న రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15మంది మృతి చెందారని.. మరో 40మందికిపైగా గాయాలపాలైనట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

AlsoRead కాచీగూడ రైలు ప్రమాదం ఇలా జరిగింది(వీడియో)

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొట్టడంతో రైలు ఇంజిన్లు సహా ముందు బోగీలు చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులు అంతా నిద్ర మత్తులో ఉన్నారు. దీంతో చాలా మంది బోగీల్లోనే ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సిగ్నల్స్ తప్పిదం వల్లే రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చాయని... అందువల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 
 

click me!