The annual Asia Power Index : ఆసియా పవర్ ఇండెక్స్ ర్యాకింగ్స్ విడుద‌ల‌.. భార‌త్ ర్యాంకింగ్ ఎంతంటే?

By team teluguFirst Published Dec 6, 2021, 4:53 PM IST
Highlights

వార్షిక ఆసియా పవర్ ఇండెక్స్‌ను లోవీ ఇన్‌స్టిట్యూట్ నివేదిక వెలువ‌డింది.ఇందులో భార‌త్ ఆసియాలోనే
నాల్గొ శ‌క్తివంత‌మైన దేశంగా ఎదిగిన‌ట్టు నివేదిక‌లో పేర్కొంది. క‌రోనా . వ‌రుస లాక్ డౌన్ల‌తో దేశ ఆర్థిక వృద్ది క్షిణించింద‌నీ తెలిపింది.
 

 The annual Asia Power Index : భార‌త్ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. ఆసియా లోనే అత్యంత శ‌క్తివంత‌మైన దేశంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. లోవీ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హించిన ఆసియా పవర్ ఇండెక్స్ 2021 లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వనరులు మరియు సంభావ్యత ఆధారంగా ఈ నివేదిక‌లో  
ర్యాంకింగ్‌లను నిర్ణయించారు. కాలక్రమేణా శక్తి సమతుల్యతలో మార్పులను చేస్తూ.. ఆర్థిక సామర్థ్యం, ​​సైనిక సామర్థ్యం, ​​స్థితిస్థాపకత, సాంస్కృతిక ప్రభావం ఆధారంగా భార‌త్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ  ఆసియా పవర్ ఇండెక్స్ లో నేపాల్, శ్రీలంక కంటే భారతదేశం దిగువ స్థానంలో ఉండ‌టం గ‌మనార్హం.  

దేశంలో కరోనా మహమ్మారి విజృంభ‌న, వరుస లాక్‌డౌన్ ల‌ కార‌ణంగా.. 2020తో పోలిస్తే దాని మొత్తం స్కోరు రెండు పాయింట్లు క్షీణించింది. 2021లో మొత్తం స్కోర్‌లో దిగ‌జారే దేశాల్లో పద్దెనిమిది దేశాలలో భారతదేశం ఒకటి అని తాజా నివేదిక పేర్కొంది.  

ఆర్థికాభివృద్ధి త‌గ్గిన‌ప్ప‌టికీ.. భవిష్యత్ వనరుల కొలతలో ఉత్తమ పనితీరును కనబరిచింది. యూఎస్,ఏ చైనా కంటే వెనుకబడి ఉంది. నిజానికి కరోనా కాలంలోనూ ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భార‌త్ నిలిచినా..  వృద్ధి సామర్థ్యాన్ని అందుకోవడం ఆర్థిక అంచనాలు త‌గ్గాయ‌ని లోవీ ఇన్స్టిట్యూట్ తెలిపింది.

మ‌రోవైపు భార‌త్ ప్రాంతీయ సైనిక విధానాల పురోగతిని క‌న‌బ‌రుస్తోంది. మ‌న దేశం మిలటరీ నెట్‌వర్క్‌లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.  అలాగే..   ప్రాంతీయ వాణిజ్య ఏకీకరణ ప్రయత్నాలలో మరింత వెనుకబడి ఉన్నందున, ఆర్థిక సంబంధాలలో భారతదేశం ఎనిమిదో స్థానానికి పడిపోయిందని లోవీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. 
 
ఈ జాబితాలో మొదటి పది దేశాల్లో.. US, చైనా, జపాన్, భారతదేశం, రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ లు నిలిచాయి. వృద్ధి పరంగా, 2021 నాటికి US తన అధోముఖ పథాన్ని మెరుగుపరుచుకుంది, రెండు కీలక ర్యాంకింగ్‌లలో చైనాను అధిగమించింది.

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో అధికారంలో వెనుకబడిన మొదటి దేశం చైనా అని కూడా నివేదిక వివరిస్తుంది. నివేదిక ప్రకారం, తైవాన్, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్ 2030 నాటికి అతిపెద్ద ఆర్థిక వృద్ధిని క‌న‌బ‌రుస్తాయ‌ని నివేదిక పేర్కొన్న‌ది. అందుబాటులో ఉన్న వనరులను బట్టి భారత్ ఈ ప్రాంతంలో ఊహించిన దాని కంటే తక్కువ ప్రభావాన్ని చూపుతుందని.. గ‌త రెండు మునుపటి సంవత్సరాలతో పోలిస్తే 2021లో మరింత దిగజారిందని నివేదిక పెర్కొంది.

click me!