కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై ఉగ్రదాడి, ఆరుగురు మృతి

Published : Jun 29, 2020, 12:04 PM ISTUpdated : Jun 29, 2020, 06:04 PM IST
కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై ఉగ్రదాడి, ఆరుగురు మృతి

సారాంశం

ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు అని ఇమ్రాన్ ఖాన్ అని కనీసం వారం అయినా  గడవకముందే పాకిస్తాన్ పై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై తీవ్రవాదులు పంజా విసిరారు. 

తీవ్రవాదుల దుశ్చర్యలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు అని ఇమ్రాన్ ఖాన్ అని కనీసం వారం అయినా  గడవకముందే పాకిస్తాన్ పై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై తీవ్రవాదులు పంజా విసిరారు. 

భవనంపై ఒక్కసారిగా దాడి జకరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.  భద్రతాబలగాలు వారిపై ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఆ భవనంలో భద్రతాబలగాలకు, తీవ్రవాదులకు మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. 

ఇప్పటివరకు ఆరుగురు మరణించారని, అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాగానే ఒక పూర్తి స్థాయి స్టేట్మెంట్  ని విడుదల చేస్తామని, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 

భవనంలోపల చిక్కుకున్నవారందరినీ బయటకు తీసుకురావడానికి భద్రతాబలగాలు ప్రయత్నిస్తున్నాయి. యావత్ దేశం ఒక్కసారిగా ఈ చర్యవల్ల నిర్ఘాంతపోయింది. 

ఈ ఘటనపై సింధ్ ప్రాంత గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ స్పందించారు. తీవ్రవాదం పై పాకిస్తాన్ చేస్తున్న యుద్ధాన్ని దెబ్బతీసేలా ఈ దాడి జరిగిందని ఆయన ఈ దాడిని ఖండించారు. భద్రత బలగాల చీఫ్ లకు సదరు  ముష్కరులను ప్రాణాలతో పట్టుకొని వారికి వారి వెనుక ఉన్నవారికి కూడా కఠిన శిక్షలు పడేలా చూడాలని చెప్పినట్టు ఆయన అన్నారు. సింధ్ ను ఎట్టి పరిస్థితుల్లోనయినా కాపాడుకుంటామని అన్నాడు. 

పూర్తి వివరాలు అందగానే మరింత సమాచారాన్ని అందిస్తాము. 

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?