ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్లతో భారత ప్రభుత్వం చర్చలు.. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని వినతి

By Siva KodatiFirst Published Aug 31, 2021, 6:25 PM IST
Highlights

ఖతార్‌లోని దోహాలో తాలిబన్ పొలిటికల్ ఎఫైర్ చీఫ్ మొహమ్మద్ అబ్బాస్‌ను భారత రాయబారి దీపక్ మిట్టల్ కలిశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న భారతీయులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే అంశంపై ఇద్దరు చర్చించారు. దీంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు ఆఫ్ఘన్‌లో ఆశ్రయం కల్పించొద్దని దీపక్ మిట్టల్ స్పష్టం చేశారు. 

అమెరికా పారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. ఈ సమయంలో తాలిబన్లతో ఇండియా చర్చలకు సిద్ధమైందా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖతార్‌లోని దోహాలో తాలిబన్ పొలిటికల్ ఎఫైర్ చీఫ్ మొహమ్మద్ అబ్బాస్‌ను భారత రాయబారి దీపక్ మిట్టల్ కలిశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వున్న భారతీయులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే అంశంపై ఇద్దరు చర్చించారు. దీంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు ఆఫ్ఘన్‌లో ఆశ్రయం కల్పించొద్దని దీపక్ మిట్టల్ స్పష్టం చేశారు. 

అంతకుముందు దక్షిణాసియాలో భారత్ కీలకమైన దేశమని, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో ఆ దేశానికి ఎలాంటి ముప్పూ ఉండబోదని తాలిబాన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌కు దశాబ్దాలుగా మంచి సంబంధాలున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ఏర్పడే కొత్త ప్రభుత్వమూ(తాలిబాన్ ప్రభుత్వమూ) భారత్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నదని స్పష్టం చేశారు.

ALso Read:ఆఫ్ఘన్‌ను వీడిన అమెరికా దళాలు: మొదలైన తాలిబన్ల ఊచకోత.. హెలికాఫ్టర్ పైనుంచి ఉరితీత, ఇది ట్రైలర్ మాత్రమే

తాలిబాన్లు పాకిస్తాన్‌ వైపు పక్షపాతం వహిస్తారని, ఇతర దేశా ల కంటే పాక్‌కే అధిక ప్రాధాన్యతనిస్తారన్న వార్తలు వచ్చాయని, భారత్‌ను కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ చేతిలో ఆయుధంగా ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందన్న కథనాలను జబీబుల్లా ముజాహిద్ ముందు ప్రస్తావించగా వాటిని కొట్టిపారేశారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని అన్నారు. ఒక దేశానికి వ్యతిరేకంగా ఇంకో దేశం తమను వాడుకోవడాన్ని తాలిబాన్లు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోరని స్పష్టం చేశారు. భారత్‌కు తమ నుంచి ఎలాంటి హానీ ఉండబోదని స్పష్టంగా చెప్పాలని భావిస్తున్నామి హామీనిచ్చారు.

click me!