మనవరాలి తల నిమిరిన వ్యక్తి...ఇంతమందిని చంపుతాడునుకోలేదు

Siva Kodati |  
Published : Apr 23, 2019, 08:42 AM ISTUpdated : Apr 23, 2019, 08:43 AM IST
మనవరాలి తల నిమిరిన వ్యక్తి...ఇంతమందిని చంపుతాడునుకోలేదు

సారాంశం

ఉగ్రవాదుల దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పేలుళ్లకు కొద్దిసేపటి వరకు తమతోనే ఉన్న వారు ఇక లేరని తెలిసి కుమిలిపోతున్నారు. 

ఉగ్రవాదుల దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పేలుళ్లకు కొద్దిసేపటి వరకు తమతోనే ఉన్న వారు ఇక లేరని తెలిసి కుమిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు ఎలా జరిగాయో వివరిస్తున్నారు.

ఫెర్నాండో అనే పెద్దాయన ఆత్మాహుతి సభ్యుడు చర్చిలోకి ఎలా ప్రవేశించింది తెలిపారు. ‘‘ ప్రార్ధనలు పూర్తవుతున్న సమయంలో ఓ కుర్రాడు బరువైన బ్యాగ్‌తో చర్చిలోకి ప్రవేశించాడన్నారు.

తమ పక్క నుంచి వెళ్తూ.. నా మనవరాలి తల మీద నిమిరాడని .. అయితే ప్రార్థనలు పూర్తవుతున్న సమయంలో అతడు చర్చిలోకి ఎందుకు వచ్చాడో తమకు అర్ధం కాలేదని ఫెర్నాండో తెలియజేశాడు.

అతడి మొహంలో ఏ మాత్రం భయం, ఆత్రుత లేదని.. చాలా ప్రశాంతంగా ఉన్నాడని కొద్దిసేపటికే అతను తనను తాను పేల్చేసుకున్నాడని వివరించారు. పేలుడు వినగానే అక్కడి వారంతా భయంతో పరుగులు తీశారని.. ఏం జరిగిందో తెలిసే లోపు చర్చి ప్రాంగణమంతా మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో భయానకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అదృష్టం కొద్ది తమ కుటుంబంలో ఎవరికి ఏం కాలేదని.. అయితే తన వర్గానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఉగ్రదాడులు జరిగానా తాను ఈ రోజు ఉదయం చర్చికి వెళతానని... తాము ఏ మాత్రం భయపడమని.. ఉగ్రవాదులను గెలవనీయమని ఫెర్నాండో స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే