
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలు, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారం అందుతున్న సంగతి తెలిసిందే. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా సహా పలు యూరప్ దేశాలు సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. రష్యాతో పోల్చితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్ చాలా వెనుకబడిన దేశమే. అందుకే ఈ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధం ప్రారంభం కాకముందు నుంచే వెపన్స్‌ను తరలించాయి. అయితే, స్పెయిన్ రాణి తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనం కలిగించింది. ఆమె ఉక్రెయిన్‌కు గిఫ్ట్‌గా గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను పంపించారు. గిఫ్ట్‌గా ఆయుధాలు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతున్నది.
ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి స్పెయిన్ క్వీన్ ఏకంగా గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భారీ మొత్తంలో ఆ దేశానికి షిప్‌మెంట్ చేసింది. ఉక్రెయిన్ తాజాగా, స్పెయిన్ నుంచి వచ్చిన ఆయుధాల షిప్‌మెంట్‌ను స్వీకరించిందని వైస్‌గ్రాడ్ అనే మీడియా సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఆ షిప్‌మెంట్‌లో స్పెయిన్ రాణి స్వదస్తూరితో రాసిన ఐ విష్ యూ విక్టరీ అనే సందేశాన్ని రాసి ఉంచారు. విత్ లవ్ లెటీషియా అనే లైన్ కూడా ఆ పోస్టు కార్డుపై రాశారు. తొలుత ఈ షిప్‌మెంట్ రాగానే స్థానిక సిబ్బంది కొంత తికమకపడ్డట్టు తెలిసింది. కానీ, ఆ పోస్టు కార్డు చూసి స్పెయిన్ రాణి పంపిన షిప్‌మెంట్‌గా గుర్తించారు.
ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా మార్గాలను ధ్వంసం చేసే ఎత్తును రష్యా బలగాలు వేశాయి. ఇందులో భాగంగా రైల్వేకు ఇంధనం సమకూర్చే ఆరు ఫెసిలిటీలను పేల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వార ఈ రైల్వే నెట్‌వర్క్ ద్వారా ఆయుధాలను దొన్‌బాస్ రీజియన్‌కు సరఫరా చేపట్టడం ఉక్రెయిన్‌కు కష్టతరంగా మారింది. అంతేకాదు, ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్ ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా రైల్వే నెట్‌వర్క్ మొత్తాన్ని నాశనం చేయాలని రష్యా భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ క్వీన్ గిఫ్ట్‌గా వెపన్స్ షిప్‌మెంట్ పంపడం ఉక్రెయిన్‌కు ఎంతో కలిసి వచ్చింది.
ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభించింది. ఈ యుద్ధంలో మన ఘోస్ట్ ఆఫ్ కీవ్ వార్ హీరో సుమారు 40 యుద్ధ విమానాలను నేలకూల్చాడు. రష్యా వైమానిక దళానికి ఆయన ఒక పీడకలగా మారాడు. ఆయన పేరు మేజర్ స్టెపాన్ తారాబల్కా (29) అని ఉక్రెయిన్ ప్రభుత్వం రివీల్ చేసింది. మార్చి 13వ తేదీన ఈ వార్ హీరో మరణించాడు. గగనపు వీధిలో చుట్టూ శత్రు విమానాలు మోహరించి తాను ఆపరేట్ చేస్తున్న మిగ్-29 యుద్ధ విమాన్ని దాడి చేసి నేలకూల్చాయి.