దక్షిణ కొరియాలో విలయతాండవం చేస్తున్న కరోనా .. ఒక్కరోజే 6 లక్షల కొత్త కేసులు..

Published : Mar 17, 2022, 01:08 PM IST
దక్షిణ కొరియాలో విలయతాండవం చేస్తున్న కరోనా .. ఒక్కరోజే 6 లక్షల కొత్త కేసులు..

సారాంశం

దక్షిణ కొరియాలో కరోనా విరుచుకుపడుతోంది. కేవలం ఒక్క రోజులోనే ఆరు లక్షల కొత్త కేసులు నమోదవ్వడం భయాందోళనలు కలిగిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం కట్టడి నివారణ చర్యలకు బదులు ఆంక్షల సడలింపు దిశగా ఆలోచిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. 

సియోల్ :  South Koreaలో covid 19 విలయతాండవం చేస్తోంది. గత నెల రోజులుగా అక్కడ కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలోకి మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అని కొరియా వ్యాధి నియంత్రణ నివారణ సంస్థ (కేడీసీఏ) వెల్లడించింది. దక్షిణ కొరియాలో తాజాగా 24 గంటల వ్యవధిలో ఆరు లక్షల 21 వేల మూడు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి.  క్రితం రోజు తో పోలిస్తే కేసుల సంఖ్య ఏకంగా 55 శాతం పెరగడం గమనార్హం.  దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 82 లక్షలకు చేరింది.  ఈ ఏడాది జనవరి చివరి వారంలో దక్షిణకొరియా లో తొలిసారిగా ఐదు కేసులు నమోదయ్యాయి.

 అప్పటి నుంచి  వైరస్ ఉధృతి మరింత పెరుగుతూనే ఉంది.  మార్చి 9న తొలిసారి మూడు లక్షలు దాటగా..  సరిగ్గా వారం రోజులకు కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది.  ఇదే సమయంలో మరణాలు  కూడా  భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా  నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది వైరస్తో ప్రాణాలు కోల్పోగా..  ఒక రోజులో ఈ స్థాయిలో మరణాలు నమోదవడంతో ఇదే తొలిసారి అని కేడీసీఏ  తెలిపింది.

ఒమిక్రాన్ వేరియంట్ తో పాటు కరుణ ఆంక్షల సడలింపు కారణంగానే కేసులు అమాంతం పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.  అయితే  వైరస్ ఉధృతి  పెరుగుతున్నప్పటికీ..  దేశంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపించడం లేదు.  సరి కదా..  ఉన్న వాటిని మరింత సడలించాలని కొరియా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చిన్న వ్యాపారాలు,  స్వయం ఉపాధి బృందాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు ఎత్తివేసే అంశంపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం అక్కడ రాత్రి 11 గంటల తర్వాత బిజినెస్ కర్ఫ్యూ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో  ప్రైవేటు కార్యక్రమాల్లో ఆరుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని ఆంక్షలు అమలులో ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే