డబ్ల్యుహెచ్ఓ కు నిధులు నిలిపివేసిన ట్రంప్: ఈ కరోనా సమయంలో....

By Sree sFirst Published Apr 15, 2020, 10:32 AM IST
Highlights
డబ్ల్యుహెచ్ఓ నిర్వాకం వల్ల దాదాపుగా ఈ కరోనా వైరస్ 20 రేట్లు అధికంగా వ్యాపించిందని ట్రంప్ ఆరోపణలు చేసారు. అందుకోసమే ఈ ఫండింగ్ ని ఆపేస్తున్నట్టు తెలిపాడు. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) కు అమెరికా ఇచ్చే నిధులను ఆపేస్తున్నట్టు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు ప్రకటించాడు. ఈ కరోనా వైరస్ విషయంలో డబ్ల్యుహెచ్ఓ చైనా డేటా ను నమ్మి, దాన్ని సరిపోల్చుకోకుండా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని అన్నాడు. 

డబ్ల్యుహెచ్ఓ నిర్వాకం వల్ల దాదాపుగా ఈ కరోనా వైరస్ 20 రేట్లు అధికంగా వ్యాపించిందని ట్రంప్ ఆరోపణలు చేసారు. అందుకోసమే ఈ ఫండింగ్ ని ఆపేస్తున్నట్టు తెలిపాడు. గత సంవత్సరం అమెరికా 400 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని చేసింది. ఇప్పుడు అమెరికా ఆ సహాయాన్ని నిలిపివేయనుంది. 

ఇప్పటికే ప్రపంచంలో 1,25,000 మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ వైరస్ దాదాపుగా 20 లక్షల మందికి సోకింది. ఈ కరోనా కేసుల సంఖ్యా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలన్ని కూడా ఈ లాక్ డౌన్ ని కొనసాగించాలా, లేదా ఎత్తివేయాలి అని తేల్చుకోలేకపోతున్నారు. 

డబ్ల్యుహెచ్ఓ మాత్రం ఈ సమయంలో ఇలా నిధులను ఆపితే చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, ఈ మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని వారు అంటున్నారు. ఇకపోతే భారతదేశంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తుంది. 

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 11,439 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 377కు చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 38 మరణించారు. తాజాగా మరో 1,076 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 2,337 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానం ఢిల్లీ ఆక్రమించింది. ఢిల్లీలో 1,510 కేసులు రికార్డయ్యాయి. తమిళనాడు 1,173 కేసులతో మూడో స్థానంలో నిలిచించింది. 

గుజరాత్ లో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆయన మంగళవారంనాడు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఇద్దరు మంత్రులతో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు. ఆ ఎమ్మెల్యే హాజరైన ప్రెస్ కాన్ఫెరన్స్ కు కాంగ్రెసు ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా కూడా హాజరయ్యారు. 

ముంబైలోని బాంద్రాలో వలస కూలీల సమస్య ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ పొడగింపుతో వలస కూలీలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. బాంద్రాలోని రైల్వే స్టేషన్ వద్ద వలస కూలీలు కూడారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 642కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 110 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మంగళవారం కరోనా వైరస్ తో ఒక్కరు మరణించారు. దీంతో తెలంగాణలో మరణాల సంఖ్య 18కి చేరుకుంది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 249 కేసులు నమోదయ్యాయి.  
click me!