
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో దారుణం జరిగింది. ఓ ఆరో తరగతి విద్యార్థిని స్కూల్లో కాల్పులు జరిపింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెడితే...
వాయువ్య అమెరికా రాష్ట్రమైన ఇడాహోలోని ఒక స్కూల్ లో గురువారం ఓ విద్యార్థిని కాల్పులు జరిపింది. ఆమెను గమనించి, ఓ టీచర్ తన దగ్గరినుంచి గన్ లాక్కునే లోపు ముగ్గురు గాయపడ్డారు.
ఇడాహో జలపాతం సమీపంలోని రిగ్బీ మిడిల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడింది ఆరో తరగతి విద్యార్థి, అంటే ఆమె వయస్సు 11, 12 ఏళ్ళకు మించి ఉండదు.
‘స్కూలు వచ్చే బ్యాక్ పాక్ లో ఆమె హ్యాండ్ గన్ తీసుకొచ్చింది. స్కూల్ లోపల బైట అనేక రౌండ్లు కాల్పులు జరిపింది’ అని జెఫెర్సన్ కౌంటీ షెరీఫ్ స్టీవ్ ఆండర్సన్ తెలిపారు. ఈ కాల్పుల్లో మొత్తం ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది ఒకరు గాయపడ్డారు.
అయితే ప్రాణాపాయం జరగలేదని, ఈ గాయాలు కూడా అంత తీవ్రమైనవి కావని ఆయన అన్నారు.
విద్యార్థిని ఫైరింగ్ ఓపెన్ చేయగానే ఓ టీచర్ గమనించి.. ఆమె చేతుల్లోనుంచి గన్ లాక్కుని, పోలీసులు వచ్చేవరకు ఆమెను నిర్భంధించి ఉంచాడని అండర్సన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ కాల్పుల మీద ఎఫ్‌బిఐతో పాటు లోకల్ లా ఎన్ఫోర్స్ మెంట్ కూడా విచారిస్తోంది.
ఇండియానాపోలిస్‌లోని ఫెడెక్స్ ఫెసిలిటీ, కాలిఫోర్నియాలోని ఆఫీస్ బిల్డింగ్, కొలరాడోలోని గ్రోసరీ స్టోర్స్, అట్లాంటాలోని పలు స్పాలతో సహా ఇటీవలి వారాల్లో యుఎస్ లో అనేక కాల్పులు జరిగాయి.
అధ్యక్షుడు జో బిడెన్ గత నెలలో మాట్లాడుతూ అమెరికాలో గన్ వాయోలెన్స్ అంటువ్యాధిలా మారుతోందని, ఇది అంతర్జాతీయంగా మన దేశానికి ఇబ్బందిగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
తుపాకీ సంబంధిత నేరాలు, ఆత్మహత్యలు కలిసి నిరుడు అమెరికాలో 43,000 మందికి పైగా మరణించారు.