సింగపూర్ ఎయిర్‌ షో 2022: ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ‘తేజస్’ ప్రదర్శన (వీడియో)

Siva Kodati |  
Published : Feb 17, 2022, 10:02 PM IST
సింగపూర్ ఎయిర్‌ షో 2022: ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ‘తేజస్’ ప్రదర్శన (వీడియో)

సారాంశం

సింగపూర్‌లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఈ ఎయిర్‌షోలో ఎల్‌సీఏ తేజస్ (Tejas) ఫైటర్ జెట్ తన ప్రదర్శనతో అందరిని అలరించింది. దీనిపై భారత వైమానిక దళం హర్షం వ్యక్తం చేస్తూ.. ‘‘ ఏ డైమండ్ ఇన్ ది స్కై’’ అంటూ ట్వీట్ చేసింది.

చాలా ఏళ్ల క్రితం దుబాయ్ ఎయిర్‌షోలో (dubai air show)  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎల్‌సీఏ తేజస్ (Tejas) ఫైటర్ జెట్.. ప్రతిష్టాత్మక సింగపూర్ ఎయిర్‌షోలో (Singapore Air Show) తన ప్రదర్శనతో అందరిని అలరించింది. దీనిపై భారత వైమానిక దళం హర్షం వ్యక్తం చేస్తూ.. ‘‘ ఏ డైమండ్ ఇన్ ది స్కై’’ అంటూ ట్వీట్ చేసింది. గాలిలో చక్కర్లు కొడుతూ.. ఒక్కసారిగా కిందకి దిగివస్తూ, ప్రేక్షకులను ఊపిరి బిగబెట్టేలా చేసింది. 

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని (indian airforce) తేజస్ మార్క్ 1 యుద్ధ విమానాల విభాగం, 44 మంది అధికారులు, సిబ్బందితో కలిసి సింగపూర్‌లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న ఈ ఎయిర్‌షోలో పాల్గొంటోంది. రాయల్ మలేషియన్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఎంఏఎఫ్) వచ్చే సంవత్సరం 18 తేజస్ విమానాలను, 2025లో మరో 18 విమానాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎయిర్‌షోలో పాల్గొనాల్సిందిగా సింగపూర్ ఐఏఎఫ్‌ను ఆహ్వానించింది. 

 

 

ఈ నేపథ్యంలోనే సింగపూర్ ఎయిర్ షోలో భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేసిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ప్రదర్శనకు ఉంచారు. ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు జరిగే ఎయిర్ షోలో పాల్గొనేందుకు భారత వైమానిక దళానికి చెందిన 44 మంది సభ్యుల బృందం శనివారం సింగపూర్‌కు వెళ్లిందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది.

తేజస్ యుద్ధ విమానం తక్కువ స్థాయి ఏరోబాటిక్స్ ప్రదర్శనతో, తేలికగా ఒదిగిపోయి, అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. సింగపూర్ ఎయిర్ షో ప్రపంచ విమానయాన పరిశ్రమ తన ఉత్పత్తులను ప్రదర్శించడానికి మంచి వేదికగా నిలుస్తూ వస్తోంది. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళం పాల్గొనడం వల్ల తేజస్ విమానాలను ప్రదర్శించడానికి, రాయల్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్, ఇతర భాగస్వామ్య బృందాలతో పరిచయాలు ఏర్పడే అవకాశం లభిస్తుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

కాగా .. గతేడాది నవంబర్‌లో దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు. అప్పుడు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ వివిధ దేశాల రక్షణ శాఖలను ఆకట్టుకుంది. అలాగే 2019లో మలేషియాలో జరిగిన ఎయిర్ షోలోనూ తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం సింగపూర్ లోనూ అందరి దృష్టిని ఆకర్షించనుందని రక్షణ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

 

2019 ఫిబ్రవరిలో తేజస్ విమానం వాయుసేనలో చేరింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత యుధ్ధ విమానానికి క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడంతో పాటు పలు ప్రత్యేకతలు తేజస్ సొంతం. ఈ యుద్ధ విమానానికి దివంగత మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి తేజస్ అని నామకరణం చేశారు. తేజస్ అంటే సంస్కృత భాషలో తేజస్సు, వెలుగు అని అర్థం. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు (pv sindhu) , రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (rajnath singh) తదితరులు తేజస్‌లో విహరించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !