అమెరికాలో సిక్కు ఉబర్ డ్రైవర్ పై ప్రయాణికుడి దాడి

By telugu teamFirst Published Dec 10, 2019, 1:44 PM IST
Highlights

వాషింగ్టన్ లో డిసెంబర్ 5వ తేదీన సిక్కు డ్రైవర్.. గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే వ్యక్తిని పికప్ చేసుకున్నాడు. అయితే... డ్రైవర్ సిక్కు మతానికి చెందిన వాడు కావడంతో.. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి నోటికి వచ్చినట్లు దూషించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా తన వద్ద ఉన్న కత్తితో డ్రైవర్ పై దాడి కూడా చేశాడు. ఈ దాడిలో సదరు సిక్కు డ్రైవర్ గాయాలపాలయ్యాడు.

అమెరికాలో ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ జాతి దురహంకారానికి గురయ్యాడు.  సిక్కు మతానికి చెందిన వాడనే ఒకే ఒక్క కారణంతో... సదరు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేయడం గమనార్హం. ఈ సంఘటన వాషింగ్టన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వాషింగ్టన్ లో డిసెంబర్ 5వ తేదీన సిక్కు డ్రైవర్.. గ్రిఫిన్ లెవి సేయర్స్ అనే వ్యక్తిని పికప్ చేసుకున్నాడు. అయితే... డ్రైవర్ సిక్కు మతానికి చెందిన వాడు కావడంతో.. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి నోటికి వచ్చినట్లు దూషించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా తన వద్ద ఉన్న కత్తితో డ్రైవర్ పై దాడి కూడా చేశాడు. ఈ దాడిలో సదరు సిక్కు డ్రైవర్ గాయాలపాలయ్యాడు.

అయితే.. చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నన డ్రైవర్ వెంటనే 911 నెంబర్ కి ఫోన్ చేసి నిందితుడిపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు గ్రిఫిన్ లెవి సేయర్స్ (22) ని అరెస్టు  చేశారు. కాగా.. నిందితుడు 13వేల డాలర్లు పెనాల్టీగా కట్టి.. తరువాతి రోజు బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా... సిక్కు మతస్థులపై అమెరికాలో చాలా సార్లు దాడులు జరిగాయి.

2017 తర్వాత సిక్కు మతస్థులపై అమెరికాలో జరిగే దాడుల శాతం 200శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కాగా... గాయపడిన డ్రైవర్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

click me!