ఢాకా చేరుకొన్న మోడీ: రెండు రోజులు బంగ్లాలో టూర్

Published : Mar 26, 2021, 10:52 AM IST
ఢాకా చేరుకొన్న మోడీ: రెండు రోజులు బంగ్లాలో టూర్

సారాంశం

రెండు రోజుల పర్యటనలో పాల్గొనేందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు బంగ్లాదేశ్ కు చేరుకొన్నారు.

ఢాకా: రెండు రోజుల పర్యటనలో పాల్గొనేందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు బంగ్లాదేశ్ కు చేరుకొన్నారు.

కరోనా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా విదేశీ పర్యటనలో పాల్గొన్నారు.బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే ముందు ఆ దేశంతో పలు అంశాలపై చర్చలు జరపాలని  తాము బావిస్తున్నామని మోడీ ప్రకటించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ను కూడ ప్రధాని మోడీ కలిసే అవకాశం ఉంది.

ఇవాళ ఉదయం మోడీ 7:45 గంటలకు బంగ్లాదేశ్ కు బయలుదేరారు. ఉదయం 10 గంటలకు ఢాకాకు చేరుకొన్నారు. ఢాకా ఎయిర్‌పోర్టులో  మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని హాసీనా స్వాగతం పలికారు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

PREV
click me!

Recommended Stories

USA: అమెరికా సైన్యానికి వేరే దేశాల్లో ఏం పని.? ఆ దేశాలు వారిని ఎందుకు అనుమ‌తిస్తాయి.?
World Longest Train : బాబోయ్.. 7 కిలోమీటర్ల పొడవున్న రైలా? ఒకసారి చూస్తే దిమ్మతిరగాల్సిందే!