19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్న ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్.. నేపాల్ కోర్టు సంచలన ఆదేశం

By Rajesh KarampooriFirst Published Dec 22, 2022, 4:03 AM IST
Highlights

ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ 19 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. వృద్ధాప్యం ఆధారంగా హంతకుడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను చంపిన ఆరోపణలపై శోభరాజ్ 2003 నుంచి నేపాల్‌లోని ఖాట్మండు జైలులో ఉన్నాడు. గతంలో, చార్లెస్ స్వయంగా తన జైలు శిక్షను 75 శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. వృద్ధాప్యం ఆధారంగా హంతకుడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాలీ సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యా నేరం కింద శోభరాజ్‌ గత 19 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు. శోభ్‌రాజ్ కేసును విచారిస్తున్నప్పుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సప్న మల్ల ప్రధాన్ , టిల్ ప్రసాద్ శ్రేష్ఠ సంయుక్త బెంచ్ అతనిని విడుదల చేయాలని ఆదేశించింది.

శోభరాజ్ ప్రస్తుతం నేపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అతడిని 15 రోజుల్లోగా తన దేశానికి పంపించాలని నేపాల్ అధికారులను కోర్టు ఆదేశించింది. ఫ్రెంచ్‌కు చెందిన చార్లెస్ శోభరాజ్ తల్లిదండ్రులు ఇండియా-వియత్నాం మూలాలు కలిగిన వాళ్లు. అతను 1970లలో ఆసియా అంతటా వరుస హత్యలకు పాల్పడ్డాడు.

వృద్ధాప్య కారణాలతో విడుదల 

తన కోసం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కాలం జైలులో గడిపానని శోభరాజ్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేపాల్‌లో 75 శాతం శిక్ష అనుభవించిన ఖైదీలను జైలులో మంచి ప్రవర్తనతో విడుదల చేసేందుకు చట్టపరమైన నిబంధన ఉంది. నేపాల్‌లోని సీనియర్‌ సిటిజన్‌లకు ఇచ్చిన 'సడలింపు' ప్రకారం తాను జైలు శిక్షను పూర్తి చేశానని తన పిటిషన్‌లో శోభరాజ్ పేర్కొన్నాడు.20 సంవత్సరాల జైలులో ఇప్పటికే 17 సంవత్సరాలు గడిపానని , విడుదలకు ఇప్పటికే సిఫారసు చేయబడిందని అతను పేర్కొన్నాడు. 

20కి పైగా హత్యలు

శోభరాజ్ 20కి పైగా హత్యలకు పాల్పడ్డాడు. ఫ్రెంచ్ టూరిస్ట్‌కు విషం ఇచ్చి చంపినందుకు అతను 21 సంవత్సరాలు భారతీయ జైలులో ఉన్నాడు. 2003లో ఖాట్మండులోని ఓ క్యాసినోలో కనిపించిన అతడిని అరెస్టు చేశారు. 1975లో నేపాల్‌లో అమెరికన్ టూరిస్ట్ అయిన కొన్నీ జో బ్రోంజిచ్ హత్య కేసులో సుప్రీంకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2014లో అతను కెనడియన్ బ్యాక్‌ప్యాకర్ లారెంట్ క్యారియర్ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. రెండవ జీవిత ఖైదు విధించబడ్డాడు.

చార్లెస్ శోభరాజ్ జీవితంపై సినిమా 

రణదీప్ హుడా నటించిన 'మెయిన్ ఔర్ చార్లెస్' చిత్రం శోభరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఆ సమయంలో నటుడు కిల్లర్‌ని కూడా జైలులో కలిశాడు. ఈ చిత్రంలో శోభరాజ్ పాత్రను రణదీప్ హుడా పోషించాడు. ఈ చిత్రం 30 అక్టోబర్ 2015న విడుదలైంది.

click me!