Russia Ukraine Crisis : ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. వెనక్కి తిరిగిన ఎయిరిండియా విమానం...

Published : Feb 24, 2022, 10:56 AM IST
Russia Ukraine Crisis : ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. వెనక్కి తిరిగిన ఎయిరిండియా విమానం...

సారాంశం

భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఉక్రెయిన్‌కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి తిరుగుముఖం పట్టింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లోని ఉద్రిక్త ప్రాంతాల్లో గగనతలాన్ని మూసివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 

న్యూఢిల్లీ : Ukraine లోని సంక్షోభ, యుద్ద వాతావరణం కారణంగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఉక్రెయిన్‌కు వెడుతున్న Air India flight ఢిల్లీకి వెనక్కి తిరిగి వస్తోంది. రష్యాతో ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. ఎప్పుడైనా యుద్ధం జరిగే పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్ నుండి స్వదేశానికి వచ్చేందుకు సిద్దమయ్యారు. 

కాగా, రష్యా అధ్యక్షుడు Vladimir Putin ఈ ఉదయం ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. మిలటరీ ఆపరేషన్ ప్రారంభమయ్యిందని ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలలో పనిచేయడానికి రష్యా ప్రత్యేక దళాలను అనుమతించాడు. దీంతో ఉక్రెయిన్ లో యుద్ధం మొదలైపోయింది. దీంతో ఉక్రెయిన్ ఆయా ప్రాంతాల్లో తమ గగనతలాన్ని మూసి వేసింది. ఈ కారణంగానే ఎయిరిండియా విమానం వెనక్కి తిరిగింది. 

ఇదిలా ఉండగా, గురువారం ఉదయం Ukraine మీద Russia military operation ప్రకటించింది. డోన్బాస్ లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రష్యా అధ్యక్షుడు putin ప్రకటించాడు. మిగతా దేశాలు దీంట్లో కలగజేసుకోవద్దని తెలిపింది. కాగా ఉక్రెయిన్ కూడా తగ్గేదేలే అంటూ రష్యాకు ధీటుగా మిలటరీ ఆపరేషన్ సిద్ధం చేసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్... జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 

దీంతో ఉక్రెయిన్ వేర్పాటు వాదులు లొంగిపోవాలని హెచ్చరించిన పుతిన్.. ఇప్పటికే ఉక్రెయిన్ మూడు వైపులా రష్యా బలగాలు మొహరించాయి. ఎయిర్ స్పేస్ మూసివేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ ను మూడు ముక్కులు చేసింది రష్యా. అయితే ఉక్రెయిన్ మాత్రం ఏ మాత్రం భయపడేది లేదని చెబుతోంది. సైనిక ట్యాంకుల నుంచి యుద్ధ విమానాల వరకు సరిహద్దులకు తరలించింది రష్యా. 

కాగా, రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫిబ్రవరి 24 నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టే బిల్లుకు ఉక్రేనియన్ పార్లమెంటు మద్దతు ఇచ్చినట్లు పార్లమెంట్ ప్రెస్ సర్వీస్ తెలిపింది. లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలు మినహా అన్ని ఉక్రేనియన్ ప్రాంతాలలో 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టే చట్టానికి బుధవారం నాడు 450 సీట్ల పార్లమెంటులో 335 మంది చట్టసభ సభ్యులు మద్దతు ఇచ్చారు. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలలో, జాయింట్ ఫోర్సెస్ ఆపరేషన్ జరుగుతోంది. ప్రత్యేక చట్టపరమైన పాలన ఇప్పటికే అమలులో ఉందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

ఇంటర్‌ఫాక్స్-ఉక్రెయిన్ వార్తా సంస్థ ప్రకారం, 22 ఉక్రేనియన్ ప్రాంతాలలో అత్యవసర పరిస్థితి, సామూహిక సమావేశాలు, నిరసనలను నిర్వహించడం, సైన్యంతో ఉండేవారి నివాస స్థలాలను మార్చడం,  అస్థిరతకు దారితీసేఎలాంటి పదార్థాల ఉత్పత్తినైనా సరే ఆపేయాలంటూ నిషేధం విధించింది. 

కొత్త చట్టంలో పౌరుల కదలికపై కూడా స్వేచ్ఛను పరిమితం చేసింది. పౌరుల వాహనాలు, వారుండే స్థలాలు.. వ్యక్తిగత వస్తువులను తనిఖీలు చేయడం.. అవసరమైతే కర్ఫ్యూను ప్రవేశపెట్టాలని కూడా నిర్దేశిస్తుంది. అంతేకాకుండా, ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉన్న ప్రదేశాల నుండి నివాసితులను ఖాళీ చేయించడానికి కూడా ఈ చట్టం ఆమోదిస్తుంది. 

ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో రష్యన్ దళాలను పెంచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టాలని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి పార్లమెంటును ప్రతిపాదించింది. అంతకుముందు బుధవారం, ఉక్రెయిన్ స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్ రష్యా, బెలారస్, సముద్రాలకు ప్రాప్యత ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక చర్యలను విధించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే