Russia Ukraine Crisis : ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి వచ్చిన 80యేళ్ల వ్యక్తి.. అతని బ్యాగులో ఏముందంటే...

Published : Feb 26, 2022, 10:16 AM IST
Russia Ukraine Crisis : ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి వచ్చిన 80యేళ్ల వ్యక్తి.. అతని బ్యాగులో ఏముందంటే...

సారాంశం

తన మనుమల బంగారు భవిష్యత్ కోసం ఓ తాత సాహసానికి పూనుకున్నాడు. వారు స్వేచ్ఛావాయువులు పీల్చాలంటే.. తన మాతృభూమి పరాధీనం కావద్దనుకున్నాడు. దానికోసం 80యేళ్ల వయసులో యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు. 

తన మనుమల బంగారు భవిష్యత్ కోసం ఓ తాత సాహసానికి పూనుకున్నాడు. వారు స్వేచ్ఛావాయువులు పీల్చాలంటే.. తన మాతృభూమి పరాధీనం కావద్దనుకున్నాడు. దానికోసం 80యేళ్ల వయసులో యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వచ్చాడు. 

ఉక్రెయిన్ : Ukraine, రష్యా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఎన్నో హృదయవిదారక కథనాలు.. మానవీయ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. హృదయాన్ని మెలిపెట్టే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. చిన్నారిని వదిలి యుద్దానికి వెడుతున్న తండ్రి కన్నీరు.. బాంబుల మోత మధ్య నుంచి తల్లిదండ్రులకు ఐలవ్యూ చెబుతున్న కొడుకు.. ఉక్రెయిన్ సబ్ స్టేషన్ లో దంపతులకు వీడ్కోలు పలుకుతున్న ఫొటోలు.. ఇలా ఎన్నో చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ ఫొటో social media లో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఓ 80యేళ్ల వ్యక్తి సంచి సర్దుకుని వచ్చేశాడు. అతన్ని సైనికులు తనిఖీ చేస్తన్నారు. ఇప్పుడీ ఫొటో నెటిజన్లను కదిలించివేస్తోంది. మాతృభూమి రక్షణ కోసం ఆ వయసులో కదిలిన అతని సంకల్పానికి హ్యాట్సాప్ చెబుతున్నారు. 

ట్విటర్ లో వైరల్ గా మారిన ఉక్రెయిన్ ఆర్మీలో చేరేందుకు క్యూలో నిలబడిన ఓ వ్యక్తి ఫోటోను Kateryna Yushchenko షేర్ చేశారు. సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి చేతిలో ఓ బ్యాగ్‌ ఉంది. అతని బ్యాగ్‌లో ఉన్న వస్తువులు ఖచ్చితంగా మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ ఫొటోకు క్యాప్షన్ రాస్తూ... “ఎవరో ఈ 80 ఏళ్ల వృద్ధుడి ఫోటోను పోస్ట్ చేసారు, అతను సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం తన బ్యాగ్ లో 2 టీ-షర్టులు, ఒక జత ఎక్స్ ట్రా ప్యాంటు, టూత్ బ్రష్, కొన్ని శాండ్‌విచ్‌లు ఉన్న చిన్న లంచ్ బాక్స్  ఉన్నాయి. తన మనవళ్ల కోసం యుద్ధంలో చేరాలనుకుంటున్నట్లు చెప్పాడు” అని రాసుకొచ్చారు.

ఈ పోస్టుకు 133 వేల లైక్‌లు, టన్నుల కొద్దీ రియాక్షన్స్ వచ్చాయి. మాతృభూమి మీద ఆ వృద్ధుడికి ఉన్న ప్రేమను ప్రజలు మెచ్చుకుంటున్నారు. కామెంట్స్ లో ఇదే రాస్తూ.. శాంతి సందేశాలు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా, రష్యా ఉక్రెయిన్ మీద కాలు దువ్వి.. ఆ దేశం మీద Military actionకు పూనుకుంది. ఇది ఉక్రెయిన్ లోని జనాల్ని భయాందోళనలో పడేసింది. రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం చెబుతున్నప్పటికీ war చేసే నష్టం జరుగుతూనే ఉంది. 

ప్రజలు దేశం నుండి హంగేరి వంటి పొరుగు దేశాలకు పారిపోతున్న విషాద చిత్రాలు వెలుగులోకి వస్తుంది.. అలాంటి ఒక వీడియోలో ఉక్రెయిన్‌లోని Kyivలో ఒక వ్యక్తి తన కూతురుకు వీడ్కోలు చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ భావోద్వేగ వీడ్కోలు చూసిన ప్రతీ ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ సైన్యంలో జవాన్ అయిన ఆ వ్యక్తి యుద్ధానికి వెడుతూ కూతురుకు వీడ్కోలు పలకడం.. ఏడుస్తూ ఆ చిన్నారిని ముద్దాడడం.. వీడియోలో కనిపిస్తుంది. తండ్రిని అలా చూసి.. ఏమీ తెలియని చిన్నారి కూడా కన్నీరుమున్నీరవుతోంది. 

కైవ్ నుండి పౌరుల కోసం ఏర్పాటు చేసిన రెస్క్యూ బస్సులోకి ఎక్కేముందు ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి తన కుమార్తెను గట్టిగా హత్తుుకుని విలపించాడు. ఇలాంటిదే మరో వీడియోలో ఒక ఉక్రేనియన్ సైనికుడు.. “మేం భారీ బాంబు దాడిలో ఉన్నాం.. అమ్మా.. నాన్న.. ఐ లవ్ యూ” అంటూ పంపిన వీడియో హృదయాల్ని మెలిపెడుతోంది. ఆ వీడియోలో ఆ సైనికుడు తన కుటుంబాన్ని మళ్లీ చూడగలనా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాడు.

 

PREV
click me!

Recommended Stories

Aliens: 2026లో గ్ర‌హాంత‌ర‌వాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు
World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!