
న్యూఢిల్లీ: తూర్పు యూరప్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. రష్యా దాడితో ఉక్రెయిన్ తల్లడిల్లుతున్నది. పశ్చిమ దేశాల నుంచి సహాయం పొందుతూ రష్యాను ఎదుర్కొంటున్నది. పశ్చిమ దేశాలు, అమెరికా ఎన్నిసార్లు హెచ్చరించినా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఆర్థిక ఆంక్షలు విధింపునూ తీవ్రంగా వ్యతిరేకించారు. అది యుద్ధ ప్రకటనకు ఏ మాత్రం తీసిపోదని హెచ్చరించారు. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఉక్రెయిన్, రష్యాల మీదనే ఉన్నాయి. ఒక వైపు ఇలా యుద్ధ బీభత్సం జరుగుతుండగా.. మరో వైపు సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న డిఫెన్స్ షోలో ఆయుధాల ప్రదర్శనలో ఈ రెండు దేశాలు పోటీ పడుతుండటం నిజంగా విచిత్రమే అనిపిస్తుంది.
ఉక్రెయిన్ ప్రభుత్వ ఆయుధ ఎగుమతి దిగుమతి సంస్థ తరఫున మ్యాగ్జిమ్ పొటింకోవ్ సౌదీ అరేబియాలోని డిఫెన్స్ షోలో తమ ఉత్పత్తుల గురించి వివరణలు ఇచ్చారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడది చేయగానే.. ఆయన వెంటనే వెళ్లిపోయారు. కానీ, ఆయన తన ప్రణాళికలను అన్నీ రద్దు చేసుకుని వెనక్కి వచ్చారు. ఉక్రెయిన్‌కు చెందిన కొజార్క్ 7, కొజార్క్ 2ఎం టాక్టికల్ ఆర్మర్డ్ వెహికిల్, యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను ప్రమోట్ చేయడంపై ఫోకస్ పెట్టారు.
ఇక్కడో ఎవరైనా ఒకరు ఉండక తప్పని పరిస్థితి అని, అందుకే తాను తిరిగి వచ్చారని మ్యాగ్జిమ్ పొటింకోవ్ వివరించారు. ఇక్కడ చాలా పరికరాలు తమవి ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఆయన మైండ్‌లో వాటి అమ్మకాల గురించి పెద్దగా ఆలోచనలు లేవని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, దీని పక్కనే ఉన్న హాల్‌లో రష్యా ఆయుధ తయారీ సంస్థల ప్రదర్శనలు ఉన్నాయి. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లు ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. వారితో పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను ప్రస్తావించగా.. దానిపై స్పందించడానికి నిరాకరించారు.
ఉక్రెయిన్‌లో రష్యా దాడితో నెత్తురోడుతున్న సమయంలో రియాద్‌లోని ఈ షోకు పెద్ద మొత్తంలో సందర్శకులు రావడం గమనార్హం. సంపన్నమైన గల్ఫ్ అరబ్ దేశాలను ఆకర్షించడానికి ఆయుధ తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఆకర్షించాలని తాపత్రయ పడుతున్నాయి. ఈ రెండు దేశాలు ఇటీవలి కాలంలో చాలా దేశాల ఆయుధాలతో భిన్నమైన ఆయుధ సంపదను కలిగి ఉన్నాయి. అంతేకాదు, సొంతంగా తమ దేశంలోని పరిశ్రమల ద్వారా ఆయుధాలను తయారు చేయాలని భావిస్తున్నాయి.
సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణ బలగాలు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలపై యెమెన్‌లో దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలు సుమారు ఏడు సంవత్సరాలుగా జరుగుతున్నది.
నేరుగా ప్రజలను యుద్ధోన్ముఖులను చేయడం, వారికి ట్రైనింగ్ (Training) ఇవ్వడం, ఇప్పటికే సామాన్య పౌరులు రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకోవడం వంటి ఎన్నో ఘటనలు ఉక్రెయిన్‌లో చూశాం. దీనికి తోడు ఇప్పుడు ఆ దేశంలో క్రాష్ కోర్సు (Crash Course) కొత్త అవతారం ఎత్తింది. ఏకంగా పౌరులను యుద్ధానికి సిద్ధం చేయడానికి ప్రభుత్వం క్రాష్ కోర్సులు నెర్పుతున్నది. ఈ కోర్సులకు పౌరుల నుంచి విశేష స్పందన వస్తున్నది. వారాల కొద్దీ సాగే ఆ శిక్షణను ఒక్క ఆదివారంలో చెప్పేస్తున్నారు.