Ukraine Russia Crisis మా లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు: తేల్చేసిన రష్యా

Published : Mar 01, 2022, 04:16 PM ISTUpdated : Mar 01, 2022, 04:17 PM IST
Ukraine Russia Crisis మా లక్ష్యాన్ని సాధించే వరకు దాడులు: తేల్చేసిన రష్యా

సారాంశం

తాము నిర్ధేశించుకొన్న లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్ పై దాడులు సాగిస్తామని రష్యా ప్రకటించింది.  ఈ విషయాన్ని  రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత నెల 24వ తేదీ నుండి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది.

మాస్కో: తాము నిర్ధేశించుకొన్న లక్ష్యాలను సాధించే వరకు Ukraineపై దాడులు కొనసాగుతాయని Russia మంగళవారం నాడు ప్రకటించింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని మంగళవారం నాడు ప్రకటించింది.

గత నెల 24వ తేదీ తెల్లవారుజాము నుండి ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది.Europe నుండి అణ్వాయుధాలను తొలగించాలని అమెరికాను రష్యా డిమాండ్ చేసింది.  తమ లక్ష్యాలను సాధించే వరకు ఉక్రెయిన్ లో సైనిక కార్యకలాపాలు కొనసాగుతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోస్ కూడా ప్రకటించారు.  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూరోపియన్ పార్లమెంట్ లో మంగళవారం నాడు ప్రసంగించనున్నారు.

ఉక్రెయిన్ దేశంలోని ఖార్కివ్ నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు గాను రష్యా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా  బలగాలను ఉక్రెయిన్  నిలువరిస్తుంది.  దీంతో బాంబు దాడులను రష్యా తీవ్రం చేసింది. రాజధాని కీవ్ పట్టణానికి 64 కి.మీ దూరంలో రష్యా సైన్యం భారులు తీరి ఉంది. కీవ్ నగరం వైపు రష్యా దళాలు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను పలు దేశాలు  తీవ్రంగా ఖండిస్తున్నాయి.

UNO జనరల్ అసెంబ్లీ సమావేశానికి India గైర్హాజరైంది. బెలారస్ లో  సోమవారం నాడు  ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉంది.  జాతీయ భద్రతా సమస్యలపై ఐక్యరాజ్యసమితిలోని 12 మంది రష్యన్ దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించింది.

ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల నుండి మద్దతు పెరుగుతుంది., బ్రిటన్  నుండి ఆయుధాలు ఉక్రెయిన్ కు భారీగా వస్తున్నాయి. ఫిన్లాండ్ 2500 అసాల్డ్ రైఫిల్స్, 1500 యుద్ధ ట్యాంకులను పంపనుంది. కెనడా యాంటీ ట్యాంక్ ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని సరఫరా చేస్తుందని ఆ దేశ ప్రధాని ట్రూడో ప్రకటించారు.మరో వైపు రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. రష్యా కూడా తమపై ఆంక్షలు విధించిన దేశాలపై కౌంటర్ గా ఆంక్షలను విధిస్తుంది.

కీవ్ ను వెంటనే  విడిచి రావాలని భారతీయులను కోరింది కేంద్రం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు కేంద్రం మరింత వేగంగా చర్యలను తీసుకొంటుంది.  ఆపరేషన్ గంగాలో భాగంగా భారత వైమానిక దళం  సీ-17 విమానాలను వినియోగించనుంది. ఈ క్ర‌మంలోనే ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపాల‌నే నిర్ణ‌యం తీసుకున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది విద్యార్థులు, భార‌త పౌరులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం 9 ప్రత్యేక విమానాల ద్వారా సుమారు 8 వేల మందికి పైగా తరలించారు

టాక్సీలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో కిలోమీటర్ల మేర  దూరం నడుచుకొంటూ భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు చేరుకొంటున్నారు. చాలా మంది విద్యార్థుల వద్ద తిన‌డానికి తిండి.. తాగ‌డానికి నీళ్లు కూడా లేవు. అలాంటి దారుణ ప‌రిస్థితుల్లోనే కాలిన‌డ‌క‌నే కిలో మీట‌ర్ల మేర న‌డుస్తూ పోలాండ్‌, రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకుంటున్నారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం