కశ్మీర్ పై తేల్చుకోవాల్సింది భారత్-పాక్, మా జోక్యం అనవసరం: ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్

By Nagaraju penumalaFirst Published Aug 23, 2019, 4:11 PM IST
Highlights

 కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని మెక్రాన్ తెలిపారని చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశంలో ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా ఇరు దేశాల ప్రధానులు చర్చించుకోవాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఈ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని మెక్రాన్ స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. 
 

పారిస్: కశ్మీర్‌ విషయంలో తేల్చుకోవాల్సిందే భారత్-పాకిస్తాన్ లు మాత్రమేనని మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్. జమ్ముకశ్మీర్ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ స్పష్టం చేసింది.  

మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ఆదేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న అంశాలతోపాటు జమ్ముకశ్మీర్ విభజన ఆపై జరుగుతున్న పరిణామాలపై మెక్రాన్ తో మోదీ చర్చించారు.  

అలాగే ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై మోదీ, మెక్రాన్ తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని మెక్రాన్ తెలిపారని చెప్పుకొచ్చారు. 

కశ్మీర్ అంశంలో ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా ఇరు దేశాల ప్రధానులు చర్చించుకోవాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఈ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని మెక్రాన్ స్పష్టం చేసినట్లు చెప్పుకొచ్చారు. 

ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా చర్చించామని అలాగే శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడిన ఫ్రాన్స్‌ అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలిపారు. 

ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉభమయదేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మ్రైత్రి బంధం కొనసాగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ చేరుకున్నారు. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో సమావేశమయ్యారు. ఇరువురు దాదాపు 90నిమిషాల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. 

మోదీ ఫ్రాన్స్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో అయిదు రోజుల పాటు ఈ నెల 26 వరకు పర్యటించనున్నారు. శనివారం బహ్రెయిన్‌ వెళతారు. బహ్రెయిన్ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇకపోతే 25న తిరిగి ఫ్రాన్స్ చేరుకుంటారు. అదేరోజు జరిగే జీ-7 సదస్సులో పాల్గొంటారు. 

click me!