ఆసక్తికరం: నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన పురుషుడు

By narsimha lodeFirst Published 21, Aug 2018, 6:51 PM IST
Highlights

అమెరికాకు చెందిన థామస్ బీటీ  నాలుగోసారి మరో బిడ్డకు జన్మనిచ్చాడు. గర్భం దాల్చిన పురుషుడుగా పేరొందిన  థామస్ బీటీ నాలుగో బిడ్డకు జన్మనిచ్చాడు. 

వాషింగ్టన్:అమెరికాకు చెందిన థామస్ బీటీ  నాలుగోసారి మరో బిడ్డకు జన్మనిచ్చాడు. గర్భం దాల్చిన పురుషుడుగా పేరొందిన  థామస్ బీటీ నాలుగో బిడ్డకు జన్మనిచ్చాడు. 

అమెరికాలోని హవాయ్‌లో థామస్ బీటీ జన్మించాడు. అయితే ఆయన తొలుత అమ్మాయిగానే పుట్టాడు.  కానీ, యుక్తవయస్సులోకి రాగానే  పురుషుడిగా మారాలనే కోరిక కలిగింది. దీంతో ఆమె అతడిగా మారాలని నిర్ణయం తీసుకొంది.  ఈ మేరకు 23  ఏళ్ల వయస్సులో హర్మోన్ చికిత్స తీసుకొని పురుషుడుగా మారాడు.

పురుషుడుగా మారే క్రమంలో తనకు వచ్చిన గర్బసంచిని అలాగే ఉంచుకొన్నాడు.  పురుషుడిగా మారిన తర్వాత నాన్సీ అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు.  ఆ దంపతులు పెళ్లి చేసుకొన్న తర్వాత పిల్లలు కావాలనే కోరిక ఉంది.

అయితే నాన్సీకి  మాత్రం గర్బసంచిని తొలగించారు.  దీంతో ఆమె గర్భం దాల్చే పరిస్థితి లేకపోయింది. అయితే తానే పిల్లలు కనాలని థామస్ బీటీ నిర్ణయం తీసుకొన్నాడు.  ఈ మేరకు పురుషుడుగా మారిన తర్వాత కూడ అలాగే ఉంచుకొన్న గర్భసంచి, జననేంద్రియాల ద్వారా కృత్రిమంగా గర్భం దాల్చాడు.

ముగ్గురు పిల్లల్ని కృత్రిమ గర్భధారణ పద్దతుల ద్వారానే థామస్ బీటీ కన్నాడు. తాజాగా మరో బిడ్డకు  కూడ థామస్ బీటీ జన్మనిచ్చాడు. అయితే నాలుగో బిడ్డ పుట్టిన తర్వాత థామస్ బీటీ పూర్తిగా పురుషుడుగా మారిపోయాడు.  ఆపరేషన్ ద్వారా పురుషుల జననేంద్రియాలను పొందాడు. ఇక థామస్ బీటీ ఐదో బిడ్డను కృత్రిమ పద్దతుల ద్వారా కనాలంటే సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు అనివార్యం.


 

Last Updated 9, Sep 2018, 1:42 PM IST