ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. న్యూయార్క్‌లో ఎలాన్ మస్క్‌తో పాటు పలురంగాల ప్రముఖులను కలవనున్న మోదీ..

Published : Jun 20, 2023, 12:22 PM IST
ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. న్యూయార్క్‌లో ఎలాన్ మస్క్‌తో పాటు పలురంగాల ప్రముఖులను కలవనున్న మోదీ..

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన న్యూయార్క్‌లో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో వివిధ రంగాలకు చెందిన రెండు డజన్ల మంది ప్రముఖులను కలవనున్నారు. ఈ జాబితాలో నోబెల్ గ్రహీతలు, ఆర్థికవేత్తలు, కళాకారులు, శాస్త్రవేత్తలు, పండితులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో పాటు తదితరులు ఉన్నారు. 

మెరుగైన సినర్జీని సాధించడంపై, యూఎస్‌లో పరిణామాలను అర్థం చేసుకోవడానికి, భారతదేశంతో సహకరించడానికి ప్రజలను ఆహ్వానించడంతో పాటు పలు అంశాలపై మోదీ వారితో చర్చలు జరపనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే కొందరి జాబితాను పరిశీలిస్తే.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డి గ్రాస్సే, అమెరికన్ ఆర్థికవేత్త పాల్ రోమర్‌లతో పాటు నికోలస్ నాసిమ్ తలేబ్ రే డాలియో, ఫాలూ షా, జెఫ్ స్మిత్, మైఖేల్ ఫ్రోమాన్, డేనియల్ రస్సెల్, జెఫ్ స్మిత్, ఎల్బ్రిడ్జ్ కాల్బీ, డాక్టర్ పీటర్ అగ్రే, డాక్టర్ స్టీఫెన్ క్లాస్కో, చంద్రికా టాండన్‌లు ఉన్నారు. 

ఇక, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల అమెరికా, ఈజిప్ట్ దేశాల పర్యటనకు ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. విదేశీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘అమెరికా బయలుదేరుతున్నాను. అక్కడ నేను న్యూయార్క్ నగరం, వాషింగ్టన్ డీసీలలో పలు కార్యక్రమాలలో పాల్గొంటాను. ఈ కార్యక్రమాలలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లో చర్చలు జరపనున్నారు. దీనితో పాటు.. నేను  కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

‘‘యూఎస్‌లో నేను వ్యాపారవేత్తలను, భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలిసే అవకాశం ఉంది. వాణిజ్యం, ఆవిష్కరణలు, సాంకేతికత, ఇతర అంశాలలో భారతదేశం-అమెరికా బంధాలను మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము’’ అని మోదీ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !