ఘోర ప్రమాదం...ఇళ్లపై కూలిన విమానం

Published : Sep 17, 2019, 08:48 AM ISTUpdated : Oct 31, 2019, 08:17 AM IST
ఘోర ప్రమాదం...ఇళ్లపై కూలిన విమానం

సారాంశం

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకే కుప్పకూలిందని చెప్పారు. పొపయన్ నగర శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లల్లో  ఎవరూ లేకపోవడంతో...పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం.. ప్రమాదవశాత్తు ఇళ్లపై కూలింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకే కుప్పకూలిందని చెప్పారు. పొపయన్ నగర శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లల్లో  ఎవరూ లేకపోవడంతో...పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

కాగా...ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందని.. రూ.6 కోట్ల శాలరీ జాబ్ వదులుకున్న భర్త.. కోర్టు ఆసక్తికర తీర్పు
SuperShe Island : పురుషులకు బ్యాన్.. ఆ ఐలాండ్ రూల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !