కుప్పకూలిన విమానం... విమానంలో 157 మంది ప్రయాణికులు

Siva Kodati |  
Published : Mar 10, 2019, 03:19 PM IST
కుప్పకూలిన విమానం... విమానంలో 157 మంది ప్రయాణికులు

సారాంశం

ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది

ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది.

అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఆ విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. కూలిన విమానం ఆచూకిని కనుగొని సహాయక చర్యలు చేపట్టేందుకు గాను సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.

మరోవైపు ఈ ప్రమాదంపై ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే