కుప్పకూలిన విమానం, 12 మంది మృతి

Siva Kodati |  
Published : Mar 10, 2019, 02:06 PM IST
కుప్పకూలిన విమానం, 12 మంది మృతి

సారాంశం

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది. 

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది. కుప్పకూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంజిన్‌లో వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో తరారీయా, డోరిస్ గ్రామాల మేయర్ ఆయన కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే