పాకిస్తాన్‌లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం: 90 మంది దుర్మరణం..?

By Siva KodatiFirst Published May 22, 2020, 3:58 PM IST
Highlights

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణీకుల విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక నిమిషం ముందు కూలిపోయింది.

వివరాల్లోకి వెళితే.. పీకే 303 నెంబర్ గల విమానం శుక్రవారం లాహోర్ నుంచి కరాచీకి బయల్దేరింది. ఒక్క నిమిషంలో గమ్యస్థానానికి చేరుతుందనగా కరాచీ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని జిన్నా గార్డెన్ ప్రాంతంలోని మోడల్ కాలనీలో కుప్పకూలిపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎకానమీ క్లాస్‌లో 85 మంది, ఆరుగురు బిజినెస్ క్లాస్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ, రేంజర్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు జనావాసాలకు సమీపంలో విమానం కుప్పకూలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో నాలుగు ఇళ్లు కూడా కూలిపోయినట్లుగా సమాచారం.

click me!