12యేళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్.. ఫైజర్ టీకా ట్రయల్స్ షురూ...

By AN TeluguFirst Published Jun 9, 2021, 10:51 AM IST
Highlights

ప్రముఖ అమెరికన్ కంపెనీ ఫైజర్ 12 సంవత్సరాలలోపు వయసుగల చిన్నారులకు వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ ట్రయల్స్ మొదటి దశలో పిల్లలకు వివిధ మోతాదులో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్ కోసం ఫైజర్ ప్రపంచంలోని నాలుగు దేశాలకు చెందిన నాలుగు వేల ఐదు వందల మందికి పైగా చిన్నారులను ఎంపిక చేసింది.

పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఫైజర్ ఎంపిక చేసిన దేశాలలో  us, ఫిన్లాండ్, పోలాండ్, స్పెయిన్  ఉన్నాయి. మొదటి దశలో ట్రయల్స్ ను ఇప్పటికే ప్రారంభించినట్లు ఫైజర్ తెలిపింది.  యూఎస్, యూరోపియన్ యూనియన్లలో 12 ఏళ్లలోపు చిన్నారులపై ప్రయోగించేందుకు ఫైజర్ వ్యాక్సిన్ ఇప్పటికే ఆమోదం పొందింది. 

వ్యాక్సిన్నో తొలుత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. టీకా పరీక్ష కోసం పిల్లలకు పది మైక్రోగ్రాముల చొప్పున రెండు మోతాదులు ఇవ్వనున్నామని ఫైజర్ తెలిపింది.  ఈ మోటారు పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ మోతాదులో మూడింట ఒక వంతు. కాగా కొన్ని వారాల తరువాత ఆరు నెలల వయస్సు దాటిన పిల్లలపై ప్రారంభమవుతాయి.  వారికి 3 మైక్రోగ్రాముల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 

ఫైజర్ తో పాటు,  మోడెర్నా కూడా 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్  ట్రయల్స్ నిర్వహిస్తోంది.  గత నెలలో ఆస్ట్రాజెనికా 6 ఏళ్ల నుంచి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద ట్రయల్స్ ప్రారంభించింది. కాగా చైనాకు చెందిన సినోవాక్ సంస్థ తమ వ్యాక్సిన్ మూడు సంవత్సరాల వయసు గల పిలల్లమీద కూడా ప్రభావవంతంగా పనిచేస్తన్నదని ప్రకటించింది. 
 
click me!