పాక్ నౌకాశ్రయాల్లో నిశ్శబ్ధం.... జాడ లేని నౌకాదళం, ఏం జరుగుతోంది..?

By Siva KodatiFirst Published Mar 13, 2019, 7:29 AM IST
Highlights

పాకిస్తాన్ నౌకాదళం అదృశ్యమైంది. బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్‌లోని నౌకాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది.

పాకిస్తాన్ నౌకాదళం అదృశ్యమైంది. బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్‌లోని నౌకాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది.

దాడి అనంతరం అప్రమత్తమైన పాక్ నేవి దేశంలోని నౌకాశ్రయాలను వీడి సముద్రంలోకి వెళ్లినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాక్ నౌకాదళంలోని నౌకలు ప్రధానంగా కరాచీ, ఒర్మార, గ్వాదర్ నౌకాశ్రయాల్లో ఉంటాయి.

ఫిబ్రవరి 28 వరకు అక్కడ నౌకలు కనిపించాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు సైతం ధ్రువీకరించాయి. తొమ్మిది ఫ్రిగేట్లు, 8 జలాంతర్గాములు, 17 గస్తీ నౌకలు ఇతర చిన్నాచితకా నౌకలు అన్నీ నౌకాశ్రయాల్లోనే ఉన్నాయి.

అయితే బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ సర్జికల్ స్టైక్స్ తర్వాత నౌకాశ్రయాల్లోని నౌకలన్నీ ఒక్కొక్కటిగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో షిప్‌యార్డ్‌లన్నీ బోసీగా కనిపిస్తున్నాయి.

భారత్ దాడితో అప్రమత్తమైన పాక్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నౌకలను సముద్రంలోకి తరలించినట్లు తెలుస్తోంది. 1971 యుద్ధంలో భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్‌కు కొన్ని దశాబ్ధాలు పట్టింది. 

click me!