ఇథియోపియా విమాన ప్రమాదం: తప్పించుకున్న ఒకేఒక్కడు

By Siva KodatiFirst Published Mar 11, 2019, 12:40 PM IST
Highlights

ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. 

ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డారు.

గ్రీకుకు చెందిన ఆంటోనీ మావ్రోపోలస్ అనే వ్యక్తి... ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నైరోబిలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు హాజరుకావడానికి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి బయలుదేరారు.

అయితే అనివార్య కారణాల వల్ల రెండు నిమిషాలు ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ లోపు ఆయన ఎక్కాల్సిన బోయింగ్ 737-8 విమానం టేకాఫ్ అయిపోయింది. ఆ కాసేపటికే ఆ విమానం కుప్పకూలిపోయింది.

ఈ విషయం తెలియని మావ్రోపోలస్ మరో విమానంలో నైరోబి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ఆయనను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అనుమతించలేదు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు... మీరు గొడవ చేయడం కాదు...దేవుణ్ని ప్రార్థించాలంటూ అక్కడి పోలీస్ అధికారి చెప్పాడు.

మీరు ఎక్కాల్సిన విమానం కనబడకుండా పోయింది.. అందులో ఎక్కాల్సిన వారిలో మీరొక్కరే ఎక్కలేదన్నారు. దీంతో తాను షాక్‌కు గురయ్యానని మావ్రోపోలస్ తన అనుభవాన్ని పంచుకున్నారు. పూర్తి వివరాలు ఆరా తీసిన తర్వాతే తనను పోలీసులు వదిలిపెట్టినట్లు అతను తెలిపాడు.

విమానం కూలి 157 మంది మరణించారన్న వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైన మావ్రోపోలస్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూనే... తాను చాలా అదృష్టవంతుడిని అంటూ ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేశారు. 


 

click me!