ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్: పాక్‌లో టాప్ ట్రెండింగ్

By Siva KodatiFirst Published Feb 27, 2019, 10:28 AM IST
Highlights

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు. శత్రుదేశం భూభాగం పైకి ప్రవేశించిడమే కాకుండా ఉగ్రవాదులను నామరూపాల్లేకుండా చేసి వచ్చిన పైలట్ల ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు.

సర్జికల్ స్ట్రైక్స్-2 వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ‘‘ Indian Air Force’’ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌, పాకిస్తాన్‌లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో భారత వైమానిక దళం గురించి శోధించారు.

ముఖ్యంగా పాకిస్తానీలైతే వారి ఎయిర్‌ఫోర్స్ కన్నా భారత వైమానిక దళం గురించి శోధించారు. నిన్నంతా పాకిస్తాన్‌ గూగుల్ ట్రెండ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. భారతదేశంలో surgical strike కీ వర్డ్ ఎక్కువగా ట్రెండ్ అవ్వగా.. పాకిస్తాన్‌లో balakot కీ వర్డ్ ట్రెండ్ అయ్యింది.

సర్జికల్ స్ట్రైక్స్ విషయం భారత ప్రజలకు 8.30 నుంచి 8.50 లోపు తెలియగా.. అంతకు ముందే పాకిస్తాన్‌ వాసులకు వెలుగులోకి వచ్చింది. ఉదయం 10 గంటల సమయానికల్లా పాక్‌లో bagalkot కీ వర్డ్ పీక్స్‌కు వెళ్లగా... భారత్‌లో surgical strikes కీ వర్డ్ దూసుకెళ్లింది.

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

click me!