ఇమ్రాన్‌కు రూ.41 లక్షల కరెంట్ బిల్లు.. పవర్ కట్ చేస్తామంటూ నోటీసులు

Published : Aug 29, 2019, 03:38 PM IST
ఇమ్రాన్‌కు రూ.41 లక్షల కరెంట్ బిల్లు.. పవర్ కట్ చేస్తామంటూ నోటీసులు

సారాంశం

సాక్షాత్తూ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితికి పడిపోయింది. కొన్ని నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు రూ.41 లక్షలకు చేరుకుంది. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. 

విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో ఏకంగా ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్ చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది ఎక్కడో తెలుసా మన దాయది దేశం పాకిస్తాన్‌లో. అసలే పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం నడపడం కూడా కష్టంగా మారిపోయింది.

గ్రే లిస్ట్‌లో పెట్టడంతో నిధులు సైతం రావడం లేదు ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో సాక్షాత్తూ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితికి పడిపోయింది.

కొన్ని నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు రూ.41 లక్షలకు చేరుకుంది. బిల్లు కట్టాలంటూ ఇప్పటికే ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ పలుమార్లు నోటీసులు సైతం జారీ చేసినప్పటికీ.. పీఎంవో నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే