అత్యంత వేగంగా కారు..తన రికార్డ్ తానే బ్రేక్ చేయబోయి... జెస్సీ కాంబ్స్ మృతి

By telugu teamFirst Published Aug 29, 2019, 1:51 PM IST
Highlights

2013లో ఆమె 48ఏళ్ల మార్క్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. గంటకు 393కిలోమీటర్ల వేగంతో ఆమె కారు నడిపి నార్త్ అమెరికన్ ఈగల్ సూపర్ సోనిక్ స్పీడ్ ఛాలెంజర్ లో విజయం సాధించింది. గతంలో ఈ రికార్డ్ మార్క్ అనే వ్యక్తి పేరు మీద ఉండగా.. దానిని జెస్సీ బ్రేక్ చేసింది. తర్వాత 2016లో గంటకు 478కిలోమటర్ల వేగంతో ప్రయాణించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

జెస్సీ కాంబ్స్ ఈ పేరు వినే ఉంటారు. కార్లను అత్యంత వేగంగా నడపడం ఆమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను ఆమె సొంతం చేసుకుంది. మరో రికార్డుని తన సొంతం చేసుకునే క్రమంలో ఆమె ప్రమాదానికి గురై కన్నుమూసింది. 36ఏళ్ల జెస్సీ కాంబ్స్... అత్యంత వేగవంతగా జెట పవర్డ్ కార్లను సైతం నడపగలదు.

2013లో ఆమె 48ఏళ్ల మార్క్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. గంటకు 393కిలోమీటర్ల వేగంతో ఆమె కారు నడిపి నార్త్ అమెరికన్ ఈగల్ సూపర్ సోనిక్ స్పీడ్ ఛాలెంజర్ లో విజయం సాధించింది. గతంలో ఈ రికార్డ్ మార్క్ అనే వ్యక్తి పేరు మీద ఉండగా.. దానిని జెస్సీ బ్రేక్ చేసింది. తర్వాత 2016లో గంటకు 478కిలోమటర్ల వేగంతో ప్రయాణించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

గత ఏడాది సెప్టెంబర్ లో ఆమె తన రికార్డును తానే బ్రేక్ చేయాలని ప్రయత్నించారు. 2016లో 478కిలోమీటర్ల వేగంతో రికార్డు క్రియేట్ చేయగా... గతేడాది గంటకు 483కిలోమీటర్ల వేగంతో ప్రయత్నించారు. కానీ అది సక్సెస్ కాలేదు. అప్పుడు ఆమె స్పల్ప ప్రమాదానికి గురయ్యారు. తర్వాత ఆమె తాజాగా మంగళవారం అక్కడే ప్రయత్నించారు. ఈసారి తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. దీంతో మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది. 

click me!