పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా భయం: పాజిటివ్ గా తేలిన మంత్రి

By Sreeharsha Gopagani  |  First Published Jul 4, 2020, 10:26 AM IST

కొన్ని రోజుల కింద ఖురేషి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటూ అనేక మంది మంత్రులను కలిసాడు. కాబినెట్ మీటింగ్ కి కూడా హాజరయ్యాడు. ఇప్పుడు వారందరు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. 


పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం నాడు ఆయనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన వివిధ ఉన్నతాధికారులతో విదేశీ రాయబారులతో చర్చలను నిర్వహించారు. ఇప్పుడు ఆయన కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో... ఆయనతో సమావేశమైన అందరూ అధికారులు ఇప్పుడు కరోనా పరీక్షలు చేపించుకోనున్నారు. 

కొన్ని రోజుల కింద ఖురేషి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటూ అనేక మంది మంత్రులను కలిసాడు. కాబినెట్ మీటింగ్ కి కూడా హాజరయ్యాడు. ఇప్పుడు వారందరు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. 

Latest Videos

undefined

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాపిస్తోంది. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు నమోదవడమే కాకుండా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ మన భారతదేశంపై కూడా దాడి చేస్తూనే ఉంది. మన దగ్గర కూడా ప్రజాప్రతినిధులు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. 

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ వైరస్ బారినపడ్డవారు కనబడుతూనే ఉన్నారు. తెలంగాణాలో ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలకు ఒక మాజీ ఎంపీకి కరోనా వచ్చిన విషయం వెలుగుచూడగానే.... తాజాగా తెలంగాణ హోమ్ మంత్రి కూడా కరోనా బారినపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజాప్రతినిధులకు ఈ వైరస్ సోకుతూనే ఉంది. తాజాగా ఆంధ్ర  ప్రదేశ్ లో అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. దీంతో ఈ మీటింగ్ లో పాల్గొన్న ఇతర ప్రజాప్రతినిధులు కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. 

తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలియజేస్తూ రోశయ్య ఓ వీడియో ప్రకటన చేశారు.  తనకు కరోనా లక్షణాలయిన దగ్గు, జలుబు, జ్వరం ఏమీ లేవని... సంపూర్ణ ఆరోగ్యంగా వున్నానన్నారు. కానీ కరోనా పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో హోంక్వారంటైన్ లో వున్నానని... ప్రజలకు ఇకపై ఫోన్ లో మాత్రమే అందుబాటులో వుంటానని రోశయ్య వెల్లడించారు. 

click me!