పాకిస్థాన్‌లో వరద‌ల‌ బీభత్సం..  వేయి మందికి పైగా మృతి.. 9 ల‌క్ష‌ల ఇండ్లు ధ్వంసం..

Published : Aug 28, 2022, 12:09 PM IST
పాకిస్థాన్‌లో వరద‌ల‌ బీభత్సం..  వేయి మందికి పైగా మృతి.. 9 ల‌క్ష‌ల ఇండ్లు ధ్వంసం..

సారాంశం

పాకిస్థాన్‌లో వరద బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన సంఘటనలలో ఇప్పటివరకు సుమారు 1,033 మంది మరణించారు, అలాగే కోట్లాది రూపాయల ఆస్తిన‌ష్టం జ‌రిగింది. ఇప్ప‌టికే పాక్‌ ప్రభుత్వం నేషనల్‌ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. 

పాకిస్థాన్‌లో వరద బీభత్సం సృష్టిస్తుంది. సింధ్‌ ప్రావిన్స్‌, బలూచిస్థాన్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా, పంజాబ్‌ ప్రావిన్స్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకూ వేయిమందికి పైగా మరణించారు. మ‌రో మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్ప‌టికే పాక్‌ ప్రభుత్వం నేషనల్‌ ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. 4 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం జ‌రిగిన‌ట్టు  అంచనా వేయబడింది. 

గత 24 గంటల్లో 119 మంది మరణించారు. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..విపత్తు కార‌ణంగా మొత్తం మరణాల సంఖ్య 1,033కి చేరుకుంది. శనివారం నమోదైన మరణాలలో బలూచిస్థాన్‌లో న‌లుగురు, గిల్గిత్ బాల్టిస్తాన్‌లో ఆరుగురు,  ఖైబర్ పఖ్తున్‌ఖ్వా లో 31 మంది, సింధ్ ప్రావిన్స్ లో76 మంది మృతి చెందారు. 33 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసిందని, దేశంలోని కొన్ని ప్రాంతాలలో కురుస్తూనే ఉందని, పాకిస్తాన్‌లోని కనీసం 110 జిల్లాలు వరదలతో దెబ్బతిన్నాయని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో మునుపెన్న‌డూ లేనంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంతో సతమతమవుతున్నంది. విప‌త్తు కార‌ణంగా 72 జిల్లాలు దెబ్బతిన్నాయి.
  
తొమ్మిది ల‌క్ష‌ల‌కు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి, ఇందులో 6 ల‌క్ష‌ల‌కు పైగా  ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, మూడు ల‌క్ష‌ల ఇండ్లు  పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా దాదాపు ఏడు ల‌క్ష‌ల‌కు పైగా పశువులు కూడా చనిపోయాయి. అదే సమయంలో, పాకిస్తాన్ సైన్యం నిరంతరం రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది.

వచ్చే 24 గంటల్లో నౌషెరా వద్ద కాబూల్ నదిలో వరద ఉధృతి పెరిగే అవ‌కాశ‌ముంద‌ని పాకిస్తాన్ వరద అంచనా విభాగం (FFD) హెచ్చరించింది. కాలాబాగ్, చష్మా వద్ద సింధు నది కూడా రాబోయే 24 నుండి 48 గంటల్లో అధిక నుండి భారీ వరద స్థాయిలను చేరుకునే అవకాశం ఉంది.
  
ఈ విప‌త్తులో 1122 రెస్క్యూ (అగ్నిమాపక దళాలు, అంబులెన్స్, సివిల్ డిఫెన్స్) ఏజెన్సీలు  అప్రమత్తంగా  ఉండి సేవలందిస్తున్నాయి. అంచనా వేసిన వ్యవధిలో ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది, పరికరాల లభ్యతను నిర్ధారించాలని డిపార్ట్‌మెంట్ సూచించిందని కూడా చెప్పబడింది.
 
పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. 
 
>> గ‌త కొన్ని రోజులు ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న‌ వర్షాలు, వ‌రదలు కారణంగా పాకిస్తాన్‌లో పరిస్థితి  దిగజారింది. ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

>>  పాకిస్తాన్ మీడియా ప్రకారం.. సింధ్ ప్రావిన్స్ 70 శాతం వరదతో నీటమునిగింది. సింధ్ ప్రావిన్స్‌లోని 24 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
 
>> వరదలు, వర్షాలు వ‌ల్ల  4.4 బిలియన్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది. ఇది GDPలో ఒక శాతం ఉంటుంది.

 >> పాక్ పరిస్థితిని పరిశీలిస్తే.. పాకిస్తాన్ 2.6 బిలియన్ డాలర్ల విలువైన పత్తిని, 90 మిలియన్ డాలర్ల విలువైన గోధుమలను దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.

>> పాకిస్థాన్ ఈ వరద‌ల కార‌ణంగా బిలియన్ డాలర్ల విలువైన వస్త్ర ఎగుమతులను కూడా కోల్పోవలసి ఉంటుంది.

>> ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు $ 4.5 బిలియన్ల నష్టం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అంచనా వేశారు. 

>>  పాకిస్తాన్‌లో వర్షాలు, వరదల కారణంగా పత్తి పంట ఎక్కువగా నష్టపోయింది. వేల ఎక‌రాల్లో పంట  పూర్తిగా ధ్వంసమైంది.

>> పంటలే కాకుండా దాదాపు ఏడు ల‌క్ష‌ల‌ పశువులు ప్రాణాలు కోల్పోయాయి. 
 
>> సింధ్ ప్రావిన్స్‌లోని 23 జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేయబడింది.

>> పాకిస్తానీ వార్తాపత్రిక 'డాన్'లో ప్రచురించబడిన ఓ వార్త ప్రకారం..  343 మంది చిన్నారుల‌తో స‌హా  వేయి మంది ప్రాణాలు కోల్పోయారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే