
పోర్ట్ హార్కోర్ట్: Nigeriaలోని Oil Refinery లో పేలుడులో 100 మందికి పైగా మృతి చెందారు. శనివారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొందని స్థానిక అధికారులు తెలిపారు.
దక్షిణ నైజీరియాలోని చమురు శుద్ది కర్మాగారంలో ఈ Blast చోటు చేసుకుంది. ఈ ఘటనలో గుర్తించలేనంతగా మృతదేహలు కాలిపోయాయి. ఫ్యాక్టరీ ఆవరణలో మృతదేహాలు కింద పడిపోయి ఉన్నాయి. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందారని స్థానిక మీడియా ప్రకటించింది. ఆయిల్ రిఫైనరీ Factory లో పేలుడు చోటు చేసుకొందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటన రివర్స్ ఇమో స్టేట్ మధ్య సరిహద్దులో చోటు చేసుకొందని రాష్ట్ర పోలీస్ ప్రతినిధి గ్రేస్ ఇరింగే కోకో చెప్పారు. ఈ ప్రాంతంలో చట్ట విరుద్దంగా క్రూడ్ రిఫైనరింగ్ చేయడం సాధారణం. ముడి చమురును దొంగిలించడానికి పైప్ లైన్ ను ధ్వంసం చేయడం వాటిని బ్లాక్ మార్కెట్ లోకి విక్రయించడానికి శుద్ది చేస్తారు.
చమురు ఉత్పత్తి చేసే డెల్టాలో చాలా మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. నైజీరియాలో పెద్ద ఎత్తున చమురును ఉత్పత్తి చేస్తారు. రోజుకు రెండు మిలియన్ బ్యారెల్స్ చమురును ఉత్పత్తి చేయనున్నారు. చమురు శుద్ది చేసే ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరగడం సర్వసాధారణం, పైప్ లైన్ నిర్వహణ సరిగా లేని కాారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటాయి.
Petrolను తరలించే పైప్ లైన్ లను ధ్వంసం చేసి అక్రమంగా తరలించే క్రమంలో కూడా ప్రమాదాలు చోటు చేసకొంటాయని అధికారులు చెప్పారు. దేశంలో చమురు వనరులను దొంగిలించడాన్ని నిరోధించే నైజర్ డెల్టాలో అక్రమ శుద్ది కర్మాగారాలపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.