జెలెన్ స్కీకి నోబెల్ శాంతి బహుమతి.. నామినేషన్ కోసం యురోపియన్ దేశాల ప్రయత్నాలు ముమ్మరం..

Published : Mar 19, 2022, 06:39 AM IST
జెలెన్ స్కీకి నోబెల్ శాంతి బహుమతి.. నామినేషన్ కోసం యురోపియన్ దేశాల ప్రయత్నాలు ముమ్మరం..

సారాంశం

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాడి నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చూపిస్తున్న తెగువ.. ప్రజలతోపాటే ఉంటాననడం ప్రపంచదేశాలను కదిలిస్తోంది. దీంతో అతడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని యురోపియన్ దేశాలు కోరుతున్నాయి. 

కీవ్ : ప్రపంచంలోనే శక్తివంతమైన Weapons కలిగిన రష్యా చేస్తున్న సైనిక చర్యను ఉక్రెయిన్ సేనలు  దీటుగా ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రష్యా వ్యూహాలకు అందని విధంగా Ukraineసైన్యం చేస్తున్న పోరాటం తీరు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భీకర దాడులతో Russia సేనలు వణికిస్తున్నప్పటికీ  తమ పౌరుల  వెంటే ఉన్నానంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyy  ఆ దేశ పౌరులకు మద్దతుగా నిలుస్తుండడం.. ఆయనను నిజమైన హీరోగా నిలబెడుతుంది. ఓవైపు ప్రపంచ  దేశాల సాయం కోరుతూనే..  మరోవైపు యుద్ధానికి ముగింపు పలకాలని శత్రుదేశం తో చర్చలు కొనసాగిస్తున్న ప్రయత్నాలు దేశాధినేతలను కదిలిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి Nobel Peace Prizeకి నామినేట్ చేయాలని ప్రతిపాదనలు మొదలయ్యాయి. అయితే ఈ ఏడాది పురస్కారాల కోసం దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోవడంతో  జెలెన్ స్కీ  కోసం దాన్ని పొడిగించాలని కోరుతూ యూరోపియన్ నేతల నుంచి విజ్ఞప్తులు ఎక్కువయ్యాయి. ‘ నోబెల్ శాంతి బహుమతికి  జెలెన్ స్కీని నామినేషన్ అనుమతించేందుకు గానూ..నామినేషన్ విధానం దరఖాస్తు ప్రక్రియను పున:పరిశీలించండి. ఇందుకోసం  కాస్త తేదీని మార్చి 31,  2022 వరకు పొడిగించండి. ఉక్రెయిన్ do అధ్యక్షుడు,  ఆ దేశ ప్రజల కోసం నోబెల్ కు దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిగణలోకి తీసుకోండి’  అని నార్వేజియన్ నోబెల్ కమిటీకి విజ్ఞప్తి చేస్తూ యూరోపియన్  నేతలు లేఖ రాశారు.

 అయితే,  2022 నోబెల్ బహుమతి కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో దాన్ని తిరిగి తెరవాలని యూరోప్ నేతలు కోరుతున్నారు.  ఇక ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రధానోత్సవం అక్టోబర్ 3 నుంచి 10 తేదీల్లో జరగనుండగా ఒక్క నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా 250 మంది వ్యక్తిగతంగా 92 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే,  సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దండయాత్రను ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ రష్యా చేస్తున్న భీకర దాడులను ఉక్రెయిన్ కు దీటుగా ఎదుర్కొంటున్నాయి.  ఈ క్రమంలో దాదాపు 14 వేల మంది రష్యా సేనలను అంతం చేసినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కూడా భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని చవి చూస్తుంది.

ఇదిలా ఉండగా, Ukraine కు అవసరమైన సైనిక సహాయాన్ని Americaమెల్లిగా పెంచుతోంది. ఇప్పటికే జావెలిన్, స్టింగర్ తో ఉక్రెయిన్ డిఫెన్స్ ను  బలోపేతం చేసిన అమెరికా…తాజాగా Switch blade ఆత్మహుతి డ్రోన్ లను అందజేయనుంది. నిన్న ప్రకటించిన సైనిక సహాయంలో ఇవి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ droneలు  రష్యా సైనిక వాహనాల కదలికలను, కాన్వాయ్ లను దారుణంగా దెబ్బ తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే Anti-tank guided missileలతో  రష్యన్ల  ట్యాంకులను  దారుణంగా దెబ్బ తీస్తున్న ఉక్రెయిన్ కు మరో అస్త్రం అందినట్లు అయింది. Switch blade dronesతో కొన్ని కిలోమీటర్ల ముందు నుంచే శత్రువుల పై విరుచుకు పడే అవకాశాన్ని ఈడ్రోన్లు కల్పిస్తాయి.

 అమెరికాకు చెందిన ఏరో వైర్మాన్మెంట్ సంస్థ ది  స్విచ్ బ్లేడ్ పేరుతో లను తయారు చేస్తోంది.  దీనిలో స్విచ్ బ్లేడ్ 300, స్విచ్ బ్లేడ్ 600  రకాలు ఉన్నాయి. థియేటర్ల విమానం సైజులో వుండవు. ఇది అతి చిన్న సైజులో ఉన్నా లాయిటరింగ్ మ్యూనిషన్ ( గాలిలో చక్కర్లు కొడుతూ..లక్ష్యం కనిపించగానే  దానిపై దాడి చేసేది)  వీటిని కామికాజె ( ఆత్మాహుతి) డ్రోన్ల కేటగిరిగా పేర్కొంటారు. ఈ డ్రోన్లను సైనికుడు బ్యాక్ పాక్ లో పెట్టుకుని కూడా ప్రయాణించవచ్చు. ఈ డ్రోన్లను కొండల్లో, సముద్రాల్లో, గాలిలో నుంచి  శత్రువు కు దూరంగా ఉండి ప్రయోగించవచ్చు.  ప్రయోగించిన తర్వాతే  దీని  రెక్కలు  విచ్చుకునే  గాలిలో  డ్రోన్ లాగా ఎగురుతుంది.  అందుకే స్విచ్ బ్లేడ్  అని పేరు పెట్టారు.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే