జమైకా సుందరికి మిస్ వరల్డ్ కిరీటం: ఇండియాకు చెందిన సుమన్‌రావుకు మూడో స్థానం

By narsimha lodeFirst Published Dec 15, 2019, 8:21 AM IST
Highlights

జమైకా సుందరి టోని-ఆన్ సింగ్  మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకొన్నారు. ఇండియాకు చెందిన సుమన్ రావు మూడోస్థానంలో నిలిచారు. 


లండన్: జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకొంది. ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినోఇండియాకు చెందిన సుమన్ రావు మూడో స్థానంతో సరిపెట్టుకొంది.

జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌–2019 కిరీటం దక్కించుకొంది. లండన్‌లోని ఎక్సెల్‌ లండన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి అంగరంగ
 వైభవంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ లో జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకొన్నారు. 

గత ఏడాది మిస్‌ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్, టోనీ–ఆన్‌ సింగ్‌ తలపై మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్‌ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో  భారత్‌కు చెందిన సుమన్‌ రావ్‌ నిలిచారు.

ఈ ఏడాది నవంబర్‌ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్‌ వరల్డ్‌–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు.అయితే ఫైనల్స్ లో 10 మంది అందగత్తెలు పాల్గొన్నారు. చివరకు ఐదుగురు అందగత్తెలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడ్డారు.

 ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. జమైకా నుంచి మిస్‌ వరల్డ్‌ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్‌ నిలిచారు.

ఇక మూడో  స్థానంతో సరిపెట్టుకొన్న ఇండియాకు చెందిన సుమన్ రావుది రాజస్థాన్ రాష్ట్రం. ఆమె  1998 నవంబర్‌ 23 లో రాజస్తాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌ సమీపంలోని అయిదానాలో పుట్టారు. తండ్రి రతన్ సింగ్, తల్లి సుశీలా కున్వర్, తండ్రి నగల వ్యాపారి, తల్లి గృహిణి. 

సుమన్ రావు నవీముంబైలోని మహాత్మా స్కూల్‌ ఆఫ్‌ అకాడెమిక్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్‌ అకౌంటెన్సీ చదువుతున్నారు.

2018లో మిస్‌ నవీముంబై పోటీలో సుమన్ రావు  మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్‌ తరఫున పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ –2019ను, ఆ పోటీల్లోనే మిస్‌ ర్యాంప్‌వాక్‌ అవార్డు గెలుచుకున్నారు


 

click me!