
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో మాస్ షూటింగ్ జరిగింది. విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జొహన్నెస్‌బర్గ్‌లోని సొవెటో టౌన్‌షిప్‌లో శనివారం - ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఓ గ్రూప్ మినిబస్ ట్యాక్సీలో ఆ బార్‌కు వచ్చారు. అక్కడ బార్‌లోని ప్రజలపై శనివారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది స్పట్‌లోనే మరణించారు. శనివారం అర్ధరాత్రి పోలీసులకు ఈ విషయం తెలిసింది. బార్‌లోకి వెళ్లి వారు మృతదేహాలను హాస్పిటల్‌కు తరలించారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. వీరిని క్రిస్ హనీ భరగ్వనాథ్ హాస్పిటల్‌కు పంపించారు.
ఈ స్పాట్‌లో దొరికి కార్ట్‌రిడ్జ్‌లను పరిశీలిస్తే.. ఒక్కరే కాదు.. ఒకరి కంటే ఎక్కువ మంది కాల్పులు జరిపినట్టు గుటెంగ్ ప్రావిన్స్ పోలీసు కమిషనర్ లెఫ్టినెంట్ జనరల్ ఇలియస్ మవేలా వివరించారు.
అనుమతి ఉన్న గంటల్లోనే ఆ బార్ ఓపెన్ చేసి ఉన్నట్టు తమ ప్రాథమిక దశలో తేలిందని తెలిపారు. ఈ కాలంలోనే కొందరు ఆ బార్‌లో ఎంజాయ్ చేస్తుండగా ఈ కాల్పులు జరిగినట్టు వివరించారు. అక్కడ బార్‌లో వారు ఎంజాయ్ చేస్తుండగా.. హఠాత్తుగా కాల్పలు శబ్దాలు వచ్చాయని, రాగానే, అక్కడ ఉన్నవారంతా పరుగులు పెట్టారని పేర్కొన్నారు. వారంతా ఆ బార్ నుంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగానే మరణించినట్టు చెప్పారు. అయితే, ఈ కాల్పుల వెనుక ఉన్న కారణాలు, ఈ ప్రజల పైనే కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు.
ఈ కాల్పులకు హై క్యాలిబర్ ఆయుధాలు వినియోగించినట్టు తెలిసింది. కాల్పులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.