
థాయ్ లాండ్ : సాధారణంగా ఒక వ్యక్తి ఒక womanనే పెళ్లాడటాన్ని సమాజం, చట్టం అంగీకరిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో husband లేదా wifeకు తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే, ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక వీరు అందరినీ ప్రేమించి పెళ్లాడటం విశేషం.
అంతేనా ఎనిమిది మంది భార్యలతో ఎలాంటి గొడవలు లేకుండా ఒకే ఇంట్లో కాపురం కూడా చేస్తుండటం మరో విశేషం. thailandకు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ అనే Tattoo Artist తన ఎనిమిది మంది భార్యలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంట్లో నాలుగు బెడ్ రూమ్ లో ఉండగా బెడ్ రూంకు ఇద్దరు చొప్పున ఎనిమిది మందితో కాపురం చేస్తున్నాడు. ఇటీవల తన Marital life గురించి ఓ టీవీ షోలో మాట్లాడుతూ తన భార్యలను పరిచయం చేస్తూ, వారిని ఇలా వివరించాడు.
తన మొదటి భార్యను స్నేహితుడి పెళ్లిలో చూసి ప్రేమించానని తర్వాత ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పిన ఓంగ్.. తన రెండో భార్యను మార్కెట్లోనూ, మూడో భార్యను హాస్పిటల్ లో.. నాలుగు, ఐదు, ఆరు భార్యలను ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్ లలో చూసి ప్రేమించినట్లు తెలిపాడు. ఇక తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏడో భార్యను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇక నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు.. తన ఎనిమిదో భార్యను చూసి ఇష్టపడి అక్కడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వచ్చాను అని చెప్పాడు.
భర్త తనను కాకుండా మరో వ్యక్తిని చూస్తేనే అనుమానపడే ఈ రోజుల్లో ఏకంగా ఎనిమది మందిని పెళ్లిచేసుకున్నా భార్యలు ఏమనకపోవడం మరో విచిత్రం. వారిలో వారు గొడవలు పడడం, భర్తను హింసించడం ఈ కాపురంలో కనిపించవట. ఓంగ్ నిజంగా అదృష్టవంతుడే అతని అందరు భార్యల హృదయం విశాలమే. వీరంతా ఓంగ్ ఎంతో మంచివాడని, దయార్ద్ర హృదయుడని, తమని ఎంతో బాగా చూసుకుంటాడని కితాబు కూడా ఇస్తున్నారు.
ఇక ఓంగ్ ఏమైనా తక్కువ తిన్నాడా.. అతను కూడా తమది ఎంతో అన్యోన్య దాంపత్యం అని, తన భార్యలు అందరూ తనకు సమానమేనని.. తన ప్రేమను అందరికీ ఒకేలా పంచుతానని చెబుతున్నాడు. అంతే కాదు నా భార్యలు చాలా అందమైన వారు, చాలా మంచివారు అని కూడా తెలిపాడు. తనను ఎంతో అపురూపంగా, ప్రేమగా చూసుకుంటారని చెబుతూ తెగ మురిసిపోయాడు.
ఓంగ్ తన భార్య లు, ప్రేమ గురించి ఎంతో సంతోషంగా చెబుతుంటే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఈ రోజుల్లో ఒక భార్యతోనే వేగడం కష్టమనుకుంటే ఎనిమిది మందిని పెళ్లి చేసుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఓంగ్ ఎనిమిదిమందితో ఆపేస్తాడా? లేకుంటే.. టాటూ వేయించుకోవడానికి వచ్చిన అమ్మాయినో.. రోడ్డు మీద పోతున్న అమ్మాయినో చూసి మళ్లీ మళ్లీ ప్రేమలో పడి ఈ సంఖ్యను పెంచేస్తాడో..