
ఎవరైనా బీచ్ లో సరదాగా ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి అలా సరదాగా బీచ్ కి వెళ్లి.. వట్టి చేతులతో షార్క్ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని న్యూయార్క్ లోని ఓ బీచ్ లో చిత్రీకరించడం గమనార్హం.
ఆ వీడియోలో ఓ వ్యక్తి... చేపలు పట్టడానికి వేసే గాలాన్ని సముద్రంలోకి విసిరాడు.అనుకోకుండా.. అతనికి దానికి షార్క్ తగిలింది. అతను దానిని పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఆ షార్క్ కూడా తప్పించుకోవడానికి బాగానే ప్రయత్నించింది. లోపలికి వెళ్తున్నా కూడా.. ఆ వ్యక్తి దానిని వదలకుండా.. ఒడ్డుకు లాక్కొచ్చాడు. ఆ తర్వాత దానిని మళ్లీ నీటిలోకి వదిలేయడం గమనార్హం.
కాగా... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అతను చేసిన ఫీట్ చూసి నెటిజన్లు విస్మయానికి గురౌతున్నారు. ఇది చాలా అరుదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
"నేను అక్కడ ఉన్నాను, అది బయటి బీచ్. ఆ వ్యక్తి నిజానికి అదే షార్క్‌ను రెండుసార్లు పట్టుకున్నాడు, ఎందుకంటే అతను దానిని పట్టుకున్న తర్వాత అతను దానిని ట్యాగ్ చేశాడు." అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.
న్యూస్‌వీక్ ప్రకారం, రఫ్-టూత్ షార్క్‌లను తరచుగా సొరచేపలు, ఇసుక పులులు అని పిలుస్తారు, ఇవి బూడిద రంగు లో ఉంటాయి. ఇవి సాధారణంగా 30 నుంచి 750 అడుగుల లోతులో ఇసుక సముద్రపు ఒడ్డుకు దగ్గరగా ఉంటాయి.