పెరూలో 8 తీవ్రతతో భారీ భూకంపం

By Siva KodatiFirst Published May 26, 2019, 4:39 PM IST
Highlights

పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2.41 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. 

పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2.41 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

ఆగ్నేయ ల్యాగ్‌గాస్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, యురీమ్యాగ్వాస్ నగరానికి 158 కిలోమీటర్ల దూరంలో 114 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు తెలిపారు.

మూడు నిమిషాల పాటు ఇళ్లలోని వస్తువులు అటు ఇటు కదలడంతో జనం ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. మరోవైపు భూకంపంపై పెరూ ప్రభుత్వం స్పందించింది. రిక్టర్ స్కేలుపై మొదట 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని, లిమా, కల్లావూ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయమని తెలిపింది. 

click me!