Madeline Albright: అమెరికా తొలి మ‌హిళ దౌత్య వేత్త కన్నుమూత‌

Published : Mar 24, 2022, 01:58 AM IST
Madeline Albright: అమెరికా తొలి మ‌హిళ దౌత్య వేత్త కన్నుమూత‌

సారాంశం

Madeline Albright: అమెరికా తొలి మ‌హిళ విదేశాంగ కార్య‌ద‌ర్శిగా (U.S. secretary of state) గా సేవ‌లందించిన మడేలిన్ ఆల్బ్రైట్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆమె 1997 నుండి 2001 వరకు ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హ‌యంలో  దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా వ్య‌వ‌హ‌రించారు.    

Madeline Albright: అమెరికా తొలి మ‌హిళ విదేశాంగ కార్య‌ద‌ర్శిగా (U.S. secretary of state) గా సేవ‌లందించిన మడేలిన్ ఆల్బ్రైట్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ మేర‌కు ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుద‌ల చేశారు. గ‌త కొద్దికాలంగా.. ఆమె క్యాన్సర్‌తో మరణించిందని, ఆ సమయంలో ఆమె కుటుంబం, స్నేహితుల చుట్టూ ఉన్నారని  తెలిపారు. ప్రేమ పూర్వ‌క‌మైన‌ తల్లిని, ఓ అమ్మమ్మని, ఓ సోదరి ని,  ఓ స్నేహితుడిని కోల్పోయాం, ఆమె నిరంత‌రం  ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ఛాంపియన్" అని ప్రకటనలో పేర్కొనారు.

1993లో అప్ప‌టి ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హ‌యంలో..  ఐక్యరాజ్యసమితిలో U.S. అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ ప‌ద‌విలో మూడు సంవత్సరాల పాటు కొన‌సాగింది. ఆ తర్వాత 1997లో Madeline Albright ను విదేశాంగ కార్యదర్శిగా నామినేట్ చేశారు. ఆ స‌మ‌యంలో 99-0 ఓట్లతో విదేశాంగ కార్యదర్శిగా నామినేట్ అయ్యింది. ఇలా తొలి విదేశాంగ కార్య‌ద‌ర్శిగా ఆల్బ్రైట్ ఘ‌న‌త సాధించింది. ఆల్బ్రైట్ ఈ పదవిలో నాలుగు సంవత్సరాల పాటు కొన‌సాగారు. కొసావోలో NATO విస్తరణ, సైనిక చ‌ర్య‌ల‌పై చురుకుగా స్పందించారు.  

2001లో ప‌దవికి రాజీనామా చేసిన త‌ర్వాత‌.. ఆమె జార్జ్‌టౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో టీచింగ్ చేసింది. ఈ స‌మయంలో ఎన్నో పుస్తకాల‌ను ఆమె ర‌చించింది. ఏడు సార్లు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. 2012లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆల్‌బ్రైట్‌కు దేశ అత్యున్నత పౌర గౌరవమైన మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేసి.. గౌర‌వించారు. 

త‌న చివ‌రి ఇంటర్వ్యూ ను 2020 లో ఆమె ఎల్లే మ్యాగజైన్ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా.. ఆమె మాట్లాడుతూ..  నా జీవితంలో ఇలాంటి ఉన్న‌త‌మైన ప‌ద‌వుల‌ను చేపడుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. అమెరికా విదేశాంగ కార్యదర్శిగా.. యునైటెడ్ స్టేట్స్ సెక్రట‌రీ వ్య‌వ‌హ‌రించ‌డం చాలా ఉన్న‌త‌మైన అనుభ‌వ‌మ‌ని అన్నారు. ఆమెకు  ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే